AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ‘సరి’హద్దులు లేని ప్రేమ.. రష్యా అబ్బాయి.. ఉక్రెయిన్ అమ్మాయి.. ఇండియాలో పెళ్లి..

రష్యాకు చెందిన సెర్గీ నోవికోవ్.. ఉక్రేయిన్ అమ్మాయి ఎలానా బ్రమోకా కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు. అయితే గత కొద్ది నెలలుగా ఈ రెండు దేశాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

Viral News: 'సరి'హద్దులు లేని ప్రేమ.. రష్యా అబ్బాయి.. ఉక్రెయిన్ అమ్మాయి.. ఇండియాలో పెళ్లి..
Love Marriage
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2022 | 10:23 AM

Share

ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. కలిసిన రెండు మనసులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికైనా సిద్ధంగా ఉంటాయి. ప్రేమ కోసం యుద్ధం చేయాల్సి వచ్చినా వెనకడారు. కానీ యుద్ధంలోనే పుట్టిన ప్రేమను సరిహద్దులు దాటి పెళ్లితో గెలిపించుకున్నారు. తమ ప్రేమకు ఎలాంటి హద్దులు.. ఆంక్షలు లేవని నిరూపించుకున్నారు ఓ జంట. ఓవైపు తమ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంటే మరో దేశమైన భారత్‏లో పెళ్లితో ఏకమయ్యారు. ప్రస్తుతం వీరి వివాహనికి సంబంధించిన పోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రష్యాకు చెందిన సెర్గీ నోవికోవ్.. ఉక్రేయిన్ అమ్మాయి ఎలానా బ్రమోకా కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు. అయితే గత కొద్ది నెలలుగా ఈ రెండు దేశాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరు తమ ప్రేమను గెలిపించుకోవడానికి యుద్ధానికి దూరంగా భారతదేశంలోని హిమచల్ ప్రదేశ్‏లోని ధర్మశాలలో హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరు ఒక సంవత్సర కాలంగా ధర్మశాలలో నివసిస్తున్నారు. హిమచల్ ప్రదేశ్ కు చెందిన శర్మ.. అతని కుటుంబసభ్యులు వీరిద్దరి పెళ్లికి కన్యాదానంతోపాటు అనేక వివాహ ఆచారాలలో పాల్గోన్నారు. వీరి పెళ్లికి ఇతర విదేశీయులు అతిథులుగా హజరయ్యారు.

ఇవి కూడా చదవండి

సనాతన ధర్మ సంప్రదాయంలో వివాహం ప్రాముఖ్యతను వారికి తెలియజేసినట్లు దివ్య ఆశ్రమ పండితుడు సందీప్ శర్మ చెప్పారు. అలాగే.. వారిద్దరు శ్లోకాలు, మంత్రాలు పఠించడానికి.. అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపించారని తెలిపారు. భయాంకరమైన యుద్ధానికి దూరంగా తమ ప్రేమను పెళ్లితో గెలిపించుకున్న ఈ జంట వివాహం ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.