Viral Video: పైకి చూస్తే ట్రాన్స్‌ఫార్మర్‌.. లోపల చూస్తే కళ్లు జిగేల్‌.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: పైకి చూస్తే ట్రాన్స్‌ఫార్మర్‌.. లోపల చూస్తే కళ్లు జిగేల్‌.. వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Aug 06, 2022 | 9:56 AM

పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా స్మగ్లింగాళ్లు మారడంలేదు. పోలీసుల కంటే మితిమీరిన తెలివితో కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు.


పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా స్మగ్లింగాళ్లు మారడంలేదు. పోలీసుల కంటే మితిమీరిన తెలివితో కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా గంజాయి స్మగ్లింగ్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గంజాయి స్మగ్లింగ్ యథేశ్చగా సాగుతోంది. పోలీసులు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తూ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తుంటే స్మగర్లు తెలివి మించిపోయి గంజాయిని చెక్‌పోస్ట్‌లను దాటిచ్చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైన్‌లో నార్కొటిక్స్‌ బ్యూరో అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒరిస్సా నుంచి రాజస్థాన్‌లోని కోట్‌కు ట్రాన్స్‌ఫార్మర్‌ లోడ్‌తో వెళ్తోన్న ఓ వాహనాన్ని ఆపారు. అనుమానం రావడంతో ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ను విప్పి చూశారు. బయటకు అచ్చంగా ట్రన్స్‌ఫార్మర్‌లా కనిపిస్తున్న వాటిలో గంజాయి ప్యాకెట్లు బయటపడడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వాహనంలో ఉన్న అన్ని ట్రాన్స్‌ఫార్మర్లను విప్పి చూడగా ఏకంగా 260 కిలోల గంజాయి బయటపడింది. దీంతో వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 06, 2022 09:56 AM