Samantha: మరో ప్రాజెక్ట్‌కు సామ్ గ్రీన్ సిగ్నల్.. దుల్కర్ సల్మాన్ జోడిగా సమంత ?.. ఏ మూవీ అంటే..
మాలీవుడ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అభిలాష్ జోషి తెరకెక్కిస్తున్న సినిమా కింగ్ ఆఫ్ కోత. విభిన్నమైన గ్యాంగ్ స్టర్ డ్రామా కథాంశంతో రాబోతున్న
టాలీవుడ్ సూపర్ క్వీన్ సామ్ (Samantha) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. వరుస ప్రాజెక్ట్స్ చిత్రీకరణలో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అంటూ అన్ని భాషలలో ఇండస్ట్రీలలో దూసుకుపోతుంది సామ్. ఇప్పటికే తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తున్న ఆమె.. తమిళంలో మరోసారి విజయ్ సరసన నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తాప్సీ నిర్మాణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మాలీవుడ్ నుంచి సామ్ కబురు అందుకున్నట్లు తెలుస్తోంది.
మాలీవుడ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అభిలాష్ జోషి తెరకెక్కిస్తున్న సినిమా కింగ్ ఆఫ్ కోత. విభిన్నమైన గ్యాంగ్ స్టర్ డ్రామా కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో సమంతను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ స్టోరీ నచ్చడంతో సమంతకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరు కలిసి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి చిత్రంలో నటించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం చిత్రంలో నటించారు. ఆగస్ట్ 5న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.