Deepika Padukone: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న హీరోయిన్.. మానసిక ఒత్తిడితో షాకింగ్ డెసిషన్.. చివరకు..

మానసిక ఒత్తిడి.. డిప్రెషన్ సమస్యలతో పోరాటం చేసిన విధానం.. వైద్యుల సహాయంతో ఆ సమస్య నుంచి ఎలా బయటపడిందో తెలిపింది. అంతేకాకుండా అనేకసార్లు ఆత్మహత్య చేసుకోవాలని తాను నిర్ణయించుకున్నాని తెలిపింది.

Deepika Padukone: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న హీరోయిన్.. మానసిక ఒత్తిడితో షాకింగ్ డెసిషన్.. చివరకు..
Deepika Padukone
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 06, 2022 | 8:45 AM

మానసిక ఒత్తిడి.. డిప్రెషన్ ఓ వ్యక్తిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది. మనిషి ఆలోచనలను పూర్తిగా స్తంభింపచేసి .. జీవితం ముగిచేందుకు నిర్ణయం తీసుకునే స్థాయికి వెళ్తారు. ప్రస్తుతం చాలా మందిని డిప్రెషన్, ఒత్తిడి సమస్యలు వేధిస్తున్నాయి. మారిన జీవనశైలి.. వృత్తిపరమైన, వ్యక్తిగత సమస్యలతో ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కేవలం సామాన్యులే కాదు..సెలబ్రెటీలు కూడా ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నవారున్నారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలని చాలా సార్లు అనుకున్నానంటూ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) చెప్పింది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గో్న్న ఆమె.. మానసిక ఒత్తిడి.. డిప్రెషన్ సమస్యలతో పోరాటం చేసిన విధానం.. వైద్యుల సహాయంతో ఆ సమస్య నుంచి ఎలా బయటపడిందో తెలిపింది. అంతేకాకుండా అనేకసార్లు ఆత్మహత్య చేసుకోవాలని తాను నిర్ణయించుకున్నాని తెలిపింది.

దీపికా మాట్లాడుతూ.. “ఎలాంటి సరైన కారణాలు లేకుండానే నేను చాలా ఒత్తిడికి గురయ్యేదానిని. మానసికంగా ఎంతో బాధను అనుభవించాను. ఆ బాధను మర్చిపోవడానికి ఎక్కువ సమయం నిద్రపోవడానికి ప్రయత్నించేదానిని. మరికొన్ని సార్లు డిప్రెషన్ సమస్యతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. నా తల్లిదండ్రులు బెంగుళూరులో ఉంటారు. అప్పుడప్పుడు వారు నన్ను చూసేందుకు ముంబై వచ్చేవారు. వారు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నట్లు నటించేదాన్ని. కానీ ఓసారి మా అమ్మ ముందు బయటపడ్డాను. దీంతో వృత్తిపరమైన సమస్యలా ? లేదా భాయ్ ఫ్రెండ్ విషయమా ? అంటూ మా అమ్మ నన్ను ప్రశ్నించింది. కానీ అందుకు నా వద్ద సరైన సమాధానాలు లేవు. నాలో ఏదో తెలియని శూన్యత ఏర్పడిందని మా అమ్మ అర్తం చేసుకుని డిప్రెషన్ నుంచి నేను బయటపడేలా చేశారు. ఆ సమయంలో దేవుడే మా అమ్మను నా వద్దకు పంపాడా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చింది.

గతంలో కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పాల్గోన్న దీపికా.. 2014లో తాను డిప్రెషన్ తో బాధపడ్డాను అని.. ఇప్పటికీ చాలా మంది ఈ సమస్యను అనుభవిస్తున్నారని తెలిపింది. జీవితంలో తన ఆశయం ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ఒక్క ప్రాణాన్ని అయిన కాపాడగలిగితే చాలు అని. ప్రస్తుతం తన చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం దీపికా.. ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.