AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi ka Amrit Mahotsav: 1994 సంవత్సరం భారతీయ మోడల్స్ కు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..

1994లో భారతదేశం పేరిట ఓ చారిత్రక సంఘటన లిఖించబడింది. సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ భారతదేశం పేరును ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగేలా చేశారు. 

Azadi ka Amrit Mahotsav: 1994 సంవత్సరం భారతీయ మోడల్స్ కు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..
Aishwarya Rai Sushmita Sen
Surya Kala
|

Updated on: Aug 06, 2022 | 6:50 PM

Share

Azadi ka Amrit Mahotsav: భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్ల పూర్తి కానున్న సందర్భంగా ఈ ఏడాది ఆజాద్ కా అమృత మహోత్సవంగా స్వాతంత్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి.. నేటి వరకు భారతదేశ ప్రజలు వివిధ రంగాలలో గొప్ప  ప్రగతి సాధించారు. శాస్త్ర, సాంకేతికత, క్రీడలు, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ రంగంలో భారత దేశం గొప్ప పురోగతి సాధించింది. 1993 సంవత్సరంలో.. చిత్రనిర్మాత సత్యజిత్ రే ఆస్కార్ అవార్డులతో సత్కరించబడ్డారు.. అనంతరం 1994లో మరో రికార్డు సాధించారు. ఈ రికార్డును బాలీవుడ్ నటి సుస్మితా సేన్, ఐశ్వర్యారాయ్ క్రియేట్ చేశారు.

వాస్తవానికి..ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా భారత దేశం ప్రతి సంవత్సరం సాధించిన చారిత్రక పని గురించి తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు 1994 సంవత్సరంలో భారతీయ మహిళ అందం ప్రతిభ గురించి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన విషయం గురించి తెలుసుకుందాం. 1994లో భారతదేశం పేరిట ఓ చారిత్రక సంఘటన లిఖించబడింది. సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ భారతదేశం పేరును ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగేలా చేశారు.

1994 స్పెషల్‌ ఏమిటంటే:  1994లో, సుస్మితా సేన్ , ఐశ్వర్యారాయ్ ఇద్దరూ మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీ గోవాలో జరిగింది. ఇద్దరూ బలమైన పోటీదారులు.. మిస్ ఇండియా విజేతగా సుస్మితా సేన్ కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ ఇండియా రన్నరప్ గా ఐశ్వర్యారాయ్ నిలిచింది. మిస్ ఇండియా  స్థాయిలో సుస్మిత 1994లో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొంది. తొలిసారిగా భారత్ కు సుస్మిత మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించింది. అదే సమయంలో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఏడాది వ్యవధిలో ఇద్దరు ప్రపంచ స్థాయిలో భారతీయ మహిళల గొప్పదానిని చాటి చెబుతూ.. కిరీటాలను గెల్చుకున్నారు. అనంతరం మోడలింగ్ రంగంలో భారతదేశం ఎవరికీ తక్కువ కాదని నిరూపించారు. బాలీవుడ్ లో హీరోయిన్స్ గా తమ ప్రభతిభను చాటారు.

మిస్ ఇండియా కిరీటం కోసం రేసులో ఉన్న సుస్మిత, ఐశ్వర్య సమాన స్థాయిలో ఉన్నారు. అయితే ఒక ప్రశ్న కు సుస్మితా సేన్ చెప్పిన సమాధానం మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకునేలా చేసింది. మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచిన ఐశ్వర్యారాయ్‌కు మిస్ వరల్డ్ టైటిల్ వచ్చింది. అనంతరం చాలా మంది భారతీయ మోడల్స్ ప్రపంచ స్థాయిలో అనేక అందాల టైటిల్స్ గెలుచుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..