AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi ka Amrit Mahotsav: నేడు భారత్ కు మంచి మిత్ర దేశం ఇజ్రాయిల్.. ఆయితే ఇరుదేశాల రిలేషన్ ను పెంచిన ప్రధాని ఎవరో తెలుసా..

భారత్‌కు మంచి స్నేహ హస్తాన్ని అందించిన ఇజ్రాయెల్ సహా పలు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే.. స్వాతంత్రం రావడానికి ముందు చాలా సంవత్సరాల వరకూ భారతదేశం, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే అని తెలుసా..  రెండు దేశాల మధ్య సంబంధాలకు పునాది పడింది ఎప్పుడో తెలుసా..! 

Azadi ka Amrit Mahotsav: నేడు భారత్ కు మంచి మిత్ర దేశం ఇజ్రాయిల్.. ఆయితే ఇరుదేశాల రిలేషన్ ను పెంచిన ప్రధాని ఎవరో తెలుసా..
India Israel Relations
Surya Kala
|

Updated on: Aug 06, 2022 | 7:16 PM

Share

Azadi ka Amrit Mahotsav: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 75 ఏళ్లలో భారతదేశం అనేక రంగాల్లో తన స్థానాన్ని ఎంతో ఉన్నతంగా నిలీచింది. భారతదేశం తనను తాను మలచుకుంటూ.. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూనే.. ఇతర దేశాలతో కూడా మంచి స్నేహ సంబంధాలను నెలకొల్పింది. అంతేకాదు… ఏ దేశానికైనా అవసరమైన సమయంలో అండగా నిలబడుతూ.. దేశాలకు కూడా సహాయం చేకూడా చేసింది.. చేస్తూనే ఉంది. భారత్‌కు మంచి స్నేహ హస్తాన్ని అందించిన ఇజ్రాయెల్ సహా పలు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే.. స్వాతంత్రం రావడానికి ముందు చాలా సంవత్సరాల వరకూ భారతదేశం, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే అని తెలుసా..  రెండు దేశాల మధ్య సంబంధాలకు పునాది పడింది ఎప్పుడో తెలుసా..!

TV9 మిమల్ని.. భారతదేశ స్వాతంత్య్రం అనంతరం..  1947 నుండి 2022 వరకు దేశంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలు, ప్రయాణాలను మీ ముందుకు తీసుకొస్తుంది. భారతదేశం ఏ సంవత్సరంలో ఏ చారిత్రక పని చేసి.. చరిత్ర సృష్టించిందో పాఠకులకు పరిచయం చేస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు విషయం 1992 సంవత్సరానికి సంబంధించిన విశేషాలను గురించి తెలుసుకుందాం. నిజానికి, 1992వ సంవత్సరం.. విదేశీ సంబంధాలకు సంబంధించి భారతదేశం ఒక చారిత్రాత్మక సృష్టించిన సంవత్సరంగా నిలిచింది.

1992 స్పెషల్‌ ఏమిటంటే..  ప్రస్తుతం భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మంచి స్నేహం ఉంది. అయితే ఈ స్నేహం 1992 నుంచి మొదలైంది. వాస్తవానికి, భారతదేశం సెప్టెంబర్ 17, 1950న ఇజ్రాయెల్‌ను గుర్తించింది. అయితే రెండు దేశాల మధ్య పూర్తి దౌత్య సంబంధాలు జనవరి 29, 1992 నుంచి మొదలయ్యాయి. అంటే.. ఇరు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు పూర్తి స్థాయిలో 30 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయి. ఈ బంధం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పుడు ఘనంగా వేడుకలు జరిపారు. అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో ఇరుదేశాల నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య స్నేహం, ఇరు దేశాల ప్రజల  స్నేహం ఏర్పడింది. అత్యాధునిక ఆవిష్కరణలు, సాంకేతికతతో సహా చాలా విషయాలను ఇరు దేశాలు పంచుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

1992కి ముందు రెండు దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. సోవియట్ యూనియన్ మద్దతు కోసం దేశం రెండు వర్గాలుగా విడిపోయిందని అంటారు. అదే సమయంలో, పాలస్తీనా స్వాతంత్య్ర మద్దతు విషయంలో కూడా ఇజ్రాయెల్, భారతదేశం మధ్య సత్సంబంధాలు లేవు. పాలస్తీనా ఇజ్రాయెల్‌కు పూర్తి  వ్యతిరేకి.  ఆదేశాన్ని తమ శత్రుదేశంగా భావిస్తుంది. అయితే తరువాత భారతదేశం ఇజ్రాయెల్‌తో సంబంధాలను బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంది.  1992 సంవత్సరంలో భారతదేశం-ఇజ్రాయెల్ సంబంధాలలో కొత్త ఒరవడి నెలకొల్పారు.

ఇజ్రాయెల్‌తో స్నేహం: 1962లో చైనా, భారత్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ అప్పట్లో భారత్‌కు మద్దతుగా నిలిచింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ భారతదేశానికి మోర్టార్ల వంటి పరికరాలను కూడా ఇచ్చింది. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూడా బంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించిందని, 1985లో ఇరుదేశాల నేతలు కలిశారు. అంతరం ఇరుదేశాల మధ్య రిలేషన్ ను 1992లో ప్రధాని నరసింహారావు మరింత ముందుకు తీసుకెళ్లారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..