Ration: “ఉచిత రేషన్ ఇచ్చి కృతజ్ఞతలు ఆశిస్తారా”.. కేంద్రంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఫైర్

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi).. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రశంసిస్తూనే పరోక్షంగా ప్రభుత్వంపై మిమర్శలు చేస్తున్నారు. కరోనా కారణంగా రేషన్ ద్వారా కేంద్రం సరకులు అందిస్తున్న విషయం...

Ration: ఉచిత రేషన్ ఇచ్చి కృతజ్ఞతలు ఆశిస్తారా.. కేంద్రంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఫైర్
Varun Gandhi
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 06, 2022 | 6:57 PM

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi).. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రశంసిస్తూనే పరోక్షంగా ప్రభుత్వంపై మిమర్శలు చేస్తున్నారు. కరోనా కారణంగా రేషన్ ద్వారా కేంద్రం సరకులు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ ఎంపీ పార్లమెంట్ వేదికగా.. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ (Ration) అందిస్తున్న ప్రభుత్వానికి అభినందనలు తెలపాలని చెప్పారు. ఈ ప్రకటనపై స్పందించిన వరుణ్ ట్విటర్ (Twitter) వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పేదలకు 5 కేజీల ఉచిత రేషన్ అందించి కృతజ్ఞతలు కావాలనుకుంటున్న ఈ సభ గత ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలు మాఫీ చేసిందని చెబుతోంది. ఈ ఉచితాల జాబితాలో మెహుల్ చోక్సీ, రిషి అగర్వాల్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. దీనిని బట్టి ప్రభుత్వ నిధుల్లో ఎవరికి హక్కు ఉందని ప్రశ్నించారు. అంతే కాకుండా మాఫీ చేసిన బకాయిల వివరాలనూ తన ట్వీట్‌కు జత చేశారు. అంతే కాకుండా ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి ప్రమాదంగా మారాయని అభివర్ణించారు. ఈ ఉచితాలపై ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాగా.. బీజేపీ పార్టీకి వరుణ్ గాంధీ రాజీనామా చేస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. మేనకా గాంధీ, వరుణ్ గాంధీ పశ్చిమబంగ లోని టీఎంసీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. తృణమూల్ శిబిరం అఖిల భారత రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న తరుణంలో వీరు పార్టీ మారితే మంచి ప్రయోజనం ఉంటుందని వార్తలు వెల్లడయ్యాయి. తద్వారా తృణమూల్ అధికార విస్తరణకు మార్గం మరింత విస్తృతమవుతుందని భావించారు. ఆ సమయంలో మేనకా గాంధీ కోల్ కతా లో కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే