Viral: ఇంకా మారని పల్లెలు.. మహిళలు గెలిస్తే పరుషులు ఏం చేశారో తెలుసా.. సోషల్ మీడియాలో వైరల్

మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నారు. ఏమీ చేయలేరు, వల్ల కాదు అనే మాటలకు సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. తమదైన రంగాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తూ మగవాళ్లకు పోటీగా నిలుస్తున్నారు. అన్ని అంశాల్లో ముందుకు సాగుతున్నా.....

Viral: ఇంకా మారని పల్లెలు.. మహిళలు గెలిస్తే పరుషులు ఏం చేశారో తెలుసా.. సోషల్ మీడియాలో వైరల్
Men Oath In Madhyra Pradesh
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Aug 06, 2022 | 4:06 PM

మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నారు. ఏమీ చేయలేరు, వల్ల కాదు అనే మాటలకు సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. తమదైన రంగాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తూ మగవాళ్లకు పోటీగా నిలుస్తున్నారు. అన్ని అంశాల్లో ముందుకు సాగుతున్నా.. రాజకీయాల్లో మాత్రం వారి ప్రభావం తక్కువనే చెప్పాలి. ఎన్నికల్లో మహిళలు గెలిస్తే వారికి అధికారం ఇవ్వకుండా మగవాళ్లే పగ్గాలు చేపట్టే వార్తలను చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. గ్రామాల్లో పంచాయతీ సభ్యులుగా (Elections) మహిళలు గెలిస్తే వారే ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీకు కోపం రావడం పక్కా..ఈ పంచాయతీ ఎన్నికల్లో మహిళలు గెలిస్తే వారి స్థానంలో భర్తలు, తండ్రులు ప్రమాణస్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఈ ఘటన జరిగింది. కాగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నాయి. కాగా.. మధ్యప్రదేశ్‌లో ఇటీవలే పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి. గెలిచిన వాళ్లల్లో పురుషులతో పాటు మహిళలూ విజయం సాధించారు. కాగా గెలిచిన వారు ప్రమాణస్వీకారం చేశారు.

సాగర్‌, దమోహ్‌ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో మహిళలు గెలిస్తే వారి స్థానంలో కుటుంబంలోని మగవారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటనలు స్థానికంగా వివాదాస్పదం అయ్యాయి. ఓ మహిళ స్థానంలో ఆమె తండ్రి, మరో ఇద్దరు మహిళల భర్తలు, మరో మహిళ బావ ప్రమాణ స్వీకారం చేశారు. దామోహ్‌ జిల్లాలోని గైసాబాద్‌, పిపారియా కిరౌ గ్రామాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి. కాగా.. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఈ ఘటనలపై భారీగా విమర్శలు రావడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు. సాగర్‌ జిల్లా పంజాయతీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ విచారణకు ఆదేశించారు.

అధికారుల ఆదేశాలతో విచారణ జరిపిన సంబంధిత శాఖ అధికారులు జైసినగర్‌ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆశారాం సాహూను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. పంచాయతీ సభ్యులుగా ఎన్నికైన మహిళలను ప్రమాణ స్వీకారానికి పిలిచినప్పటికీ.. వారు రాలేదని, వారికి బదులుగా తమ బంధువులను పంపించారని ఆశారాం చెప్పడం గమనార్హం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి