దేశమంతటా ముంచుకొస్తున్న మరో ముంపు.. IMD ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ.. తెలుగు రాష్ట్రాల్లోనూ..
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో
భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు 7 నుంచి 9 వరకు పశ్చిమ, మధ్య భారతదేశంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భారీ తుఫాను నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. రుతుపవన ద్రోణి చురుకుగా సాగుతోంది. దాని ప్రభావం దక్షిణంగా రాబోయే 4-5 రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య, పశ్చిమ మధ్యకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వాయువ్య దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, రాయలసీమ, తెలంగాణ, కోస్తా మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, కేరళ, మాహేలలో ఆగస్టు 9 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చిరించింది.ఉరుములు/మెరుపులతో కూడిన విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 8-9 వరకు దక్షిణ కర్ణాటక. ఆగస్టు 8, 9 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ మరో నాలుగైదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
తెలంగాణలో ఆగస్టు 10 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగరి, వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురవనుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సిద్దిపేట, వికారబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఆగస్టు 10 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అటు, ఏపీలో కుండపోత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు7న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీస్తాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు యానాంలోనూ వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ ప్రాంతాల్లో ఆగస్టు 8 వరకు వర్షాలు కురువనున్నాయి. దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆగస్టు 7 వరకు ఓ మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడతారని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.