AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehndi Photos: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఆ ఐఏఎస్ అధికారిణి మాజీ భర్త.. నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న ఫోటోలు

తాజాగా ఖాన్‌ తన నిశ్చితార్థాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు. డాక్టర్‌ ఖాజీతో తన ఫోటోను షేర్‌ చేశారు. వైరల్‌ అవుతున్న ఫోటోల్లో ఆమె ఎర్రటి దుస్తుల్లో కొత్త పెళ్లికూతురులా అందంగా ఉంది.

Mehndi Photos: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఆ ఐఏఎస్ అధికారిణి మాజీ భర్త.. నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న ఫోటోలు
Ias Athar Aamir Khan
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2022 | 1:01 PM

Share

IAS టాపర్, IAS అధికారిణీ టీనా దాబీ మాజీ భర్త IAS అథర్ అమీర్ ఖాన్ త్వరలో మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. టీనా దాబీ నుండి విడాకులు తీసుకున్న తర్వాత, IAS అథర్ అమీర్ ఖాన్ డాక్టర్. మెహ్రీన్ ఖాజీని వివాహం చేసుకోనున్నారు. జులై 2న డాక్టర్‌ మెహ్రీన్‌ ఖాన్‌తో ఖాన్‌ నిశ్చితార్థం చేసుకున్నారు. టీనా దాబీకి రెండోసారి వివాహం జరిగిన రెండు నెలల తర్వాత..వారిద్దరూ IAS శిక్షణ కోసం ముస్సోరీలో ఉన్నప్పుడు ఖాన్‌ తన మాజీ భార్య టీనా దాబీని కలిశాడు. ఈ జంట 7ఏప్రిల్‌, 2018న వివాహం చేసుకున్నారు. అయితే, ఈ జంట 10ఆగస్టు, 2021న విడిపోయారు. తాజాగా ఖాన్‌ తన నిశ్చితార్థాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించారు. డాక్టర్‌ ఖాజీతో తన ఫోటోను షేర్‌ చేశారు. శ్రీనగర్‌లోని లాల్‌ బజార్‌లోని ఉమర్‌ కాలనీకి చెందిన మెహ్రీన్‌ ప్రస్తుతం ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఆమె జర్మనీ, యూకేలోని విశ్వవిద్యాలయాల నుండి వైద్య శాస్త్రంలో ఎండీ పట్టభద్రురాలైంది. డాక్టర్ ఖాజీ తన మెహందీ వేడుకకు సంబంధించి కొన్ని అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

Ias Athar

2015 యూపీఎస్సీ పరీక్షలో టీనా దాబీకి మొదటి ర్యాంక్ రాగా, అథర్ అమీర్ ఖాన్ రెండో ర్యాంక్ సాధించాడు. శిక్షణ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2020 సంవత్సరంలో, ఇద్దరూ విడాకుల కోసం దాఖలు చేశారు. ఇది ఆగస్టు 2021లో ఆమోదించబడింది. టీనా దాబీ నుండి విడాకులు తీసుకున్న తర్వాత మాత్రమే IAS అథర్ అమీర్ తన రెండవ వివాహం గురించి తెలియజేసారు. అతను డాక్టర్ మెహ్రీన్ ఖాజీతో నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ జంట పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలదే. కానీ మెహ్రీన్ ఖాజీ తన ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే, అథర్‌ అమీర్ ఖాన్ త్వరలో వరుడు కాబోతున్నాడని మాత్రం తెలుస్తోంది.

Ias Athar Aamir

వైరల్‌ అవుతున్న ఫోటోల్లో మెహ్రీన్ కాజీ ఎర్రటి దుస్తుల్లో కొత్త పెళ్లికూతురులా అందంగా ఉంది. దీనితో పాటు, ఆమె తన చేతులను చాచి తన గోరింట చూపిస్తుంది. ఈ ఫోటోలో మెహ్రీన్ తన జుట్టు విరబోసుకుని మరింత అందంగా కనిపిస్తోంది. సింపుల్ లుక్‌లో కూడా బాలాలో అందంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలపై అభిమానులు కామెంట్స్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మెహ్రీన్ ఖాజీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై ఐఏఎస్ అథర్ అమీర్ ఖాన్ స్పందన కూడా వచ్చింది. అథర్ కామెంట్ బాక్స్‌లో హార్ట్ ఎమోజీని రూపొందించారు. ఇది కాకుండా, మెహ్రీన్ ఇన్‌స్టా హైలైట్స్‌లో మరికొన్ని ఫోటోలను కూడా షేర్‌ చేశారు. అథర్ అమీర్ ప్రస్తుతం శ్రీనగర్‌లో కమిషనర్‌గా పోస్టింగ్‌లో ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి