Viral Video: ప్రాణం తీసిన ఫొటో సరదా.. జలపాతంలో పడిన యువకుడు.. షాకింగ్ వీడియో
జలపాతం పక్కనే అందంగా ఫోటో దిగాలనుకున్న యువకుడు కాలుజారి అందులో పడి గల్లంతయ్యాడు. తమిళనాడులోని కొడైకెనాల్లో చోటు చేసుకున్న
సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. పర్యాటకులు సెల్ఫీలు, ఫోటోస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించినా కొందరు పెడ చెవిన పెడుతుంటారు. ఎంతో సంతోషంగా స్నేహితులతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చి సెల్ఫీ మోజులో పడి విగతజీవులుగా మారుతున్నారు. ఇటీవల స్నేహితులతో కలిసి సముద్రతీరానికి విహారయాత్రకు వెళ్లగా.. అందులో 6గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మరువకముందే మరో యువకుడు ఫోటోకు బలయ్యాడు. జలపాతం పక్కనే అందంగా ఫోటో దిగాలనుకున్న యువకుడు కాలుజారి అందులో పడి గల్లంతయ్యాడు. తమిళనాడులోని కొడైకెనాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ ఘటన ఆగస్ట్ 3న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల అజయ్ పాండియన్ స్నేహితులతో కలిసి జలపాతాన్ని చూసేందుకు వెళ్లాడు. జలపాతం దగ్గర నిలబడి ఫోటో దిగాలనుకున్నాడు. అక్కడే ఉన్న రాళ్లపై నిలబడి ఫోటోలకు ఫోజులిస్తుండగా.. అతని స్నేహితుడు ఫోటోస్ తీస్తున్నాడు. అయితే తన స్నేహితుడు జాగ్రత్త అని అరుస్తున్నప్పటికీ అజయ్ వినిపించుకోకుండా మరింత కిందికి దిగి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ క్రమంలోనే అతను కాలు జారి జలపాతంలో పడిపోయాడు. ఈ సంఘటన మొత్తం ఫోన్ రికార్డ్ అయ్యింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలంలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడి ఆచూకీ ఇంకా లభించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.