వైరల్ అవుతున్న ఈ వీడియోలో…తెల్లటి రంగు ఎద్దు, నలుపు రంగు ఎద్దు వీడియోలో పోటీపడ్డాయి. అవా తమ కొమ్ములతో ఒకదానితో ఒకటి ఢీకొడుతూ ఫైట్ చేస్తున్నాయి. వచ్చే, పోయే ప్రయాణికులు వాటిని చూస్తుండి పోయారు. కానీ, ఎవరూ సాహసించి వాటిని ఆపటం గానీ, దగ్గరకు వెళ్లటం గానీ, చేయలేదు. అరగంట పాటు ఈ కుస్తీ కొనసాగింది. ఫుట్‌పాత్ డివైడర్‌పై అవి పోట్లాడుతూ కనిపించాయి. ఇలాంటి ఎద్దులే కాదు..హైవేపై ఇంకా అనేక అడవి జంతువులు అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉన్నాయి. ఇది ఇక్కడి ప్రజలకు దినదిన రోజువారీ సమస్యగా మారిందని వాపోతున్నారు స్థానికులు.
యెవాలాలోని ఫత్తేబురుజ్ నాకా ప్రాంతంలోని నగర్-మన్మాడ్ హైవేపై రెండు ఎద్దులు ఒకదానికొకటి ఢీకొంటూ వీరంగం సృష్టించాయి. ఎద్దుల పోరు కారణంగా, డ్రైవర్లు తమ వాహనాలను జాగ్రత్తగా నడిపించాల్సి వచ్చింది. ఈ బుల్ ఫైట్ కారణంగా కొందరు వాహనదారులు చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. దాదాపు అరగంట పాటు ఎద్దులు హైవేపై పోరాడాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్ వేదికగా తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి