Naga Chaitanya: ‘మళ్లీ ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారా ?’.. విలేకరి ప్రశ్నకు చైతూ దిమ్మతిరిగే ఆన్సర్..

ఈ క్రమంలోనే మళ్లీ ప్రేమను కనుగొనడానికి సిద్ధంగా ఉన్నారా ? అనే ప్రశ్నను ఎదుర్కొన్నాడు చైతూ. దీంతో చై స్పందిస్తూ..

Naga Chaitanya: 'మళ్లీ ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారా ?'.. విలేకరి ప్రశ్నకు చైతూ దిమ్మతిరిగే ఆన్సర్..
Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 06, 2022 | 8:18 AM

లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లలో బిజీగా ఉన్న చైతూకు (Naga Chaitanya) ఎక్కువగా వ్యక్తిగత విషయాల గురించి పలు ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడు. సినిమా కంటే ఎక్కువగా తన పర్సనల్ విషయాలపై ఫోకస్ పెడుతూ..అందుకు అనుగుణంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే చైతూ కూడా తనదైన శైలీలో వ్యక్తిగత, వృత్తిపరంగా ఎంతో మెచ్యూర్డ్‏గా సమాధానాలిస్తున్నారు. ఇప్పటికే మీడియాతోపాటు.. ప్రజలు కూడా తన సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రశ్నిస్తున్నారని కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న చైతూ మాట్లాడుతూ.. ఇప్పటికీ తమ ఇద్దరి మధ్య అమితమైన గౌరవం ఉందని.. తమ వ్యక్తిగత విషయాల గురించి వస్తున్న వార్తలు చూసి విసుగు వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే మళ్లీ ప్రేమను కనుగొనడానికి సిద్ధంగా ఉన్నారా ? అనే ప్రశ్నను ఎదుర్కొన్నాడు చైతూ. దీంతో చై స్పందిస్తూ.. “అవును. ఎవరికి తెలుసు. ప్రేమ అనేది మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం గాలిని ఎలా పీల్చుకుంటామో అలాగే జీవితంలో ప్రేమ కూడా చాలా ముఖ్యమైన భాగం. మనం ప్రేమించాలి. ప్రేమను స్వీకరించాలి. అదే మనల్ని ఆరోగ్యంగా .. సానుకూలంగా ఉంచుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాలతో చైతూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తనపై వచ్చిన రూమర్స్ గురించి వింటే నవ్వొస్తుందని.. ప్రతి వారం తనపై ఏదొక రూమర్ వస్తుందని.. వాటిని పట్టించుకోవడం అనవసరమని.. మొదటి అలాంటి వార్తలు చూస్తే నవ్వొచ్చిందని.. ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదంటూ చెప్పారు.