Anchor Rashmi: నెట్టింట ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మీ.. ప్లీజ్.. నన్ను భరించండి అంటూ..
మళ్లీ జబర్ధస్త్ లోకి వచ్చినందుకు నాకు ఘన స్వాగతం పలికారు. అందరికీ థాంక్స్. ఈ షో కోసం నేను ఎప్పుడూ నిలబడి ఉంటాను.
బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మీ గౌతమ్ (Rashmi Gautam). చాలాకాలాంగా ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి సైతం హోస్ట్ చేస్తుంది. అయితే ఇటీవల జబర్ధస్త్ షో నుంచి యాంకర్ అనసూయ వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ షో హోస్ట్ సీటు ఖాళీ అయ్యింది. జబర్థస్త్ కు వచ్చే కొత్త యాంకర్ ఎవరా అని తెలుసుకునేందుకు ఇటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఇటీవల ప్రోమోతో మరింత క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. చేతులు, గాజులు.. చెవులు చూపిస్తూ కొత్త యాంకర్ ఎవరా అని ఆత్రుతను కలిగించారు. అయితే ఇటీవల వచ్చిన ఎపిసోడ్లో కొత్త యాంకర్ రష్మీ అని తెల్చేశారు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ..ఎమోషనల్ పోస్ట్ చేసింది రష్మీ.
మళ్లీ జబర్ధస్త్ లోకి వచ్చినందుకు నాకు ఘన స్వాగతం పలికారు. అందరికీ థాంక్స్. ఈ షో కోసం నేను ఎప్పుడూ నిలబడి ఉంటాను. ఎప్పుడూ నేను చేయాల్సినంతవరకు ఈ షో కోసం చేస్తాను. కొత్తవాళ్లు వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటాను. నాకు ఎప్పటికీ సంతోషంగానే ఉంటుంది. అప్పటివరకు ప్లీజ్ నన్ను భరించండి అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. దీంతో వెల్ కమ్ మేడమ్.. నువ్వెప్పుడూ బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం రష్మీ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.