ఐఏఎస్ టీనా దాబీ, గాయని మామే ఖాన్‌తో ఫోటోను షేర్ చేస్తూ..జైసల్మేర్ గర్వంతో మామే ఖాన్ జీ అని క్యాప్షన్‌లో రాశారు. దీంతో పాటు, టీనా మామే ఖాన్ ప్రసిద్ధ పాట ‘మారే హివ్దా మే నాచే మోర్’ని కూడా ట్యాగ్ చేసింది. ఈ ఫోటో షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కాకుండా, గాయని మామే ఖాన్ తన ఇన్‌స్టాలో టీనా దాబీతో ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు. దీనితో పాటు క్యాప్షన్‌లో మీరు కలిసే కొంతమంది వారు వారి వెనుక చెరగని ముద్ర వేస్తారు. టీనా దాబీ జీ అలాంటి వ్యక్తి అని రాశారు. వారి సామర్థ్యం,దయార్ధ హృదయం, ఆమె పని పట్ల అంకితభావం కారణంగా మేము ఆమెను జైసల్మేర్ కలెక్టర్‌గా రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ సంతోషకరమైన సమావేశానికి గాయని టీనా దాబీకి ధన్యవాదాలు తెలిపారు.
View this post on Instagram
ఇక్కడ విశేషమేమిటంటే, 2018, మార్చి 20న రాజస్థాన్‌లోని జైపూర్ కోర్టులో టీనా దాబీ, IAS ప్రదీప్ గవాండేని వివాహం చేసుకుంది. వీరిది మతాంతర వివాహం కావడంతో అప్పట్లో ఆ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ జంట పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి కేంద్రమంత్రులు, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే, రెండేళ్లకే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2021 చివరిలో విడాకులు తీసుకున్నారు. ఐతే లవ్ జిహాద్ ప్రభావం టీనాదాబీ కాపురంలో చిచ్చురేపిందా అనే అంశంలో సోహల్ మీడియాలో చర్చకూడా కొనసాగుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి