Watch: వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన ఇతడు ఏం చేశాడో తెలిస్తే..

దొంగతనం చేసే వారిలో సాధారణంగా కొంచెం భయం ఉంటుంది. కానీ, కొందరు ఎలాంటి భయాలు లేకుండా.. పట్టపగలు కూడా దొంగతనానికి పాల్పడుతుంటారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. అతడు ఏకంగా హైవేపై ఉన్న స్ట్రీట్‌ లైట్లను దొంగిలిస్తూ అడ్డంగా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియో చూస్తే పొట్ట చెక్కలే..!

Watch: వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన ఇతడు ఏం చేశాడో తెలిస్తే..
Man Climbs On Street Light Pole
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 25, 2024 | 6:39 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ దొంగతనం వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈ క్లిప్‌లో ఒక వ్యక్తి హైవేపై ఏర్పాటు చేసిన స్ట్రీట్‌ లైట్లను దొంగిలించడం కనిపించింది. అయితే, అతడు చాకచక్యంగా స్తంభం ఎక్కి లైట్లను విప్పదీశాడు. తాడు సాయంతో భద్రంగా ఆ లైట్లను కిందకు దింపాడు. అప్పటికే కింద మరో వ్యక్తి రెడీగా ఉన్నాడు. ఇదంతా గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. తర్వాత ఏం జరుగుతుందో చూసి యూజర్లు కూడా నవ్వుకోలేకపోతున్నారు.

స్ట్రీట్ లైట్ల కోసం స్తంభం ఎక్కిన ఆ వ్యక్తి లైట్లను కిందకు దింపిన తరువాత అతను దిగబోతున్నాడు. అంతలోనే స్థానికులు, సంబంధిత సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అతన్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దొంగతనం పూర్తైందని సంతోషంగా స్తంభం దిగేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తికి ఆ స్తంభం కింద కనిపించిన సీన్‌తో ఒక్కసారిగా అతని ఫ్యూజులు ఎగిరిపోయినట్టైంది. ఇదంతా వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియోపై యూజర్లు కూడా భారీగా కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రీల్‌ను పోస్ట్ చేస్తూ, @scribe_prashant రాశారు. ఢిల్లీలో వీధి దీపాల దొంగతనం స్పెషల్ వీడియో అంటూ క్యాప్షన్‌ రాశారు. ఈ వీడియోకు ఇప్పటికే 8 లక్షల 90 వేలకు పైగా వ్యూస్‌, 9 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?