- Telugu News Photo Gallery Amazing Health Benefits of Drinking Sugarcane Juice In Telugu Lifestyle News
Sugarcane Juice Benefits : వారానికి ఒక గ్లాస్ చెరకు రసం తాగితే చాలు..! ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం
చెరకు రసం మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, జింక్, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు అధికంగా ఉండే చెరకు రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వారానికి ఒక గ్లాస్ చొప్పున స్వచ్ఛమైన పచ్చి చెరకు రసం తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Dec 25, 2024 | 3:58 PM

చెరకు రసంలో ఎక్కువ మొత్తంలో కేలరీలు, చక్కెర శాతం అధికంగా ఉండటం వల్ల ఇది ఊబకాయాన్నే పెంచే ప్రమాదం ఉందని చెబుతున్నారు. 200ml చెరుకు రసంలో దాదాపు 270 కేలరీలు, దాదాపు 100 గ్రాముల చక్కెర ఉంటుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

శరీరానికి చల్లదనాన్నిచ్చే చెరకు రసం వల్ల కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవంటున్నారు పోషకాహార నిపుణులు. 200ml చెరుకు రసంలో దాదాపు 100 గ్రాముల షుగర్ ఉంటుంది. చెరుకులో ఉండే పోలికోసనాల్ అనే కెమికల్ వల్ల తలనొప్పి, ఊబకాయం, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తాయని రీసెర్చ్‌లు చెబుతున్నాయి.

డయాబెటిస్ ఉన్న రోగులు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతారు. అందులో చెరకు రసం తీసుకోవడం కూడా ఆపేయాలి. ఎందుకంటే, ఇందులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. తద్వారా తీవ్ర అనారోగ్యం బారిపడే అవకాశం ఉంటుంది.

మీకు ఇప్పటికే ఒత్తిడి లేదా నిద్రలేమి సమస్యలు ఉంటే, చెరకు రసాన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకోవటం మంచిది కాదు.. చెరకు రసంలో ఉండే పోలికోసనాల్ నిద్రలేమికి కారణమవుతుంది. దీని కారణంగా ఒక వ్యక్తికి నిద్రలేమి సమస్య ఉండవచ్చు. అంతేకాదు, చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల దంతాలలో పుండ్లు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. చెరకు తీపి వల్ల స్వరపేటిక సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది.

మీ కొలెస్ట్రాల్ స్థాయి ఇప్పటికే ఎక్కువగా ఉంటే చెరకు రసం తీసుకోవడం మానుకోండి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు పెరుగుతుంది. నిజానికి, అధిక చక్కెర తీసుకోవడం వల్ల కాలేయం LDL కొలెస్ట్రాల్ (చెడు కొలెస్ట్రాల్) ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది HDL కొలెస్ట్రాల్ (మంచి కొలెస్ట్రాల్) ను తగ్గిస్తుంది.




