- Telugu News Photo Gallery Cinema photos Prashanth Neel Leaked Jr.NTR's Movie Story know the details here
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు.. అంత వైల్డ్ లుక్ లో తారక్‌ని చూడబోతున్నామా !!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉండబోతుంది..? ఎప్పుడు మొదలు కాబోతుంది..? వార్ 2 తర్వాత ఇమ్మీడియట్‌గా తారక్ చేయబోయే సినిమా ఇదేనా..? సోషల్ మీడియాలో వస్తున్నట్లు మైథలాజికల్ సబ్జెక్ట్‌తో తారక్, నీల్ సినిమా రాబోతుందా..? లేదంటే వేరే ఇంకేదైనా బ్యాక్‌డ్రాప్ సెట్ చేస్తున్నారా..? వచ్చింది.. అన్నింటిపై క్లారిటీ వచ్చిందిప్పుడు.
Updated on: Dec 25, 2024 | 3:57 PM

దేవర తర్వాత ఎన్టీఆర్ జోష్ మామూలుగా లేదు. హిట్టు కొట్టడం కాదు.. రాజమౌళి తర్వాతి సినిమాతో కూడా హిట్టు కొట్టడమే ఈ జోష్‌కు కారణం. తర్వాత కూడా తారక్ ప్లానింగ్ మామూలుగా లేదు.

కొడితే కుంభస్థలమే అన్నట్లుగా ఈయన దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వార్ 2 పూర్తి కాగానే.. ప్రశాంత్ నీల్ సినిమాపై ఫోకస్ చేయనున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై చాలా రోజులుగా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా ఇది మైథలాజికల్ సబ్జెక్ట్ అని.. తారక్ కోసం నీల్ కొత్తగా ట్రై చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. ఇది మైథాలజి కాదని.. పీరియడ్ సినిమా అని చెప్పుకొచ్చారు.

వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్, తారక్ సినిమా సెట్స్‌పైకి రానుంది. KGF, సలార్‌లో ఖాన్‌సార్ తరహాలోనే.. ఇందులోనూ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు నీల్.

అంతేకాదు.. యూరప్‌లోని నల్ల సముద్రం దగ్గర NTR 31 షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్‌గా నటించబోతున్నారు.




