- Telugu News Photo Gallery Cinema photos Prashanth neel prabhas salaar 2 latest update details know here
Salaar 2: సలార్ 2పై బాంబు పేల్చిన ప్రశాంత్ నీల్
మామూలుగా ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. చిన్న దర్శకుడితో ఆయన సినిమా చేసినా రికార్డుల షేపులు మారిపోతున్నాయి. అలాంటిది ఆయనకు పర్ఫెక్ట్ మాస్ డైరెక్టర్ తోడైతే రచ్చ రచ్చే ఇంక. సలార్ 2 విషయంలో ఇదే జరగబోతుంది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది..? ఎంతవరకు వచ్చింది..?
Updated on: Dec 25, 2024 | 3:44 PM

డిసెంబర్ 22, 2023.. సరిగ్గా ఏడాది కింద ఇదేరోజు సలార్ విడుదలైంది. రాధే శ్యామ్, ఆదిపురుష్ లాంటి డిజాస్టర్స్‌తో నీరుగారిపోయి ఉన్నారు ఫ్యాన్స్. ఒక్క హిట్టు కొట్టు రెబల్ అంటూ ఎదురుచూస్తున్న రోజులవి.

ఆ టైమ్‌లో ఓ మాస్ సినిమాతో వచ్చారు ప్రశాంత్ నీల్. అదే సలార్.. తొలిరోజు నుంచే ఈ సినిమాకు టాక్ అదిరిపోయింది.కేజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఆకాశమే హద్దుగా విడుదలైంది సలార్.

ఎలివేషన్స్‌తో పిచ్చెక్కిపోయారు ఆడియన్స్. అయితే ఫ్యాన్స్ కోరుకున్న బ్లాక్‌బస్టర్ అయితే కాలేదు సలార్.. ఓ మాంచి హిట్టైతే వచ్చింది.. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇదే చెప్పారు.

కేజియఫ్‌పై ఫోకస్ చేయడంతో.. సలార్ అంత బాగా రాలేదని చెప్పుకొచ్చారు.సలార్ 1 ఇయర్ అయిన సందర్భంగా మాట్లాడుతూ.. సీక్వెల్ అదిరిపోతుందని చెప్పుకొచ్చారు. తన కెరీర్‌లో సలార్ 2 బెస్ట్ స్క్రిప్ట్ అన్నారీయన.

దాంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. సలార్ 2 శౌర్యంగ పర్వం షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని తెలిపారు నీల్. మరి చూడాలిక.. ఆ మాస్ ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందో..?




