Chest Infection: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే ఛాతీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే.. అస్సలు నిర్ణక్ష్యం చేయొద్దు
కొన్నిసార్లు ఛాతీ ఇన్ఫెక్షన్ తేలికపాటిగా వస్తుంది. ఇది 7 నుంచి 10 రోజులలో నయమవుతుంది. మరి కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ ప్రాణాలను తీసేంత తీవ్రంగా మారుతుంది.
Chest Infection Syptoms: ప్రస్తుత కాలంలో చాలా మంది ఛాతీ నొప్పిని ఎదుర్కొంటున్నారు. ఛాతీలో నొప్పిని నిర్లక్ష్యం చేస్తే పలు సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. గ్యాస్ కారణంగా, లేదా ఇన్ఫెక్షన్ కారణంగా ఛాతీలో నొప్పి వస్తుంది. ఛాతీ ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా వస్తుంటుంది. మారుతున్న వాతావరణం కారణంగా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో కొన్నిసార్లు ఛాతీ ఇన్ఫెక్షన్ తేలికపాటిగా వస్తుంది. ఇది 7 నుంచి 10 రోజులలో నయమవుతుంది. మరి కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ ప్రాణాలను తీసేంత తీవ్రంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో.. ఛాతీలో నొప్పిని మరచిపోయి కూడా విస్మరించకూడదు. ఛాతీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని తీవ్రంగా పరిగణించాలి. ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరం దేనికి సంకేతం ఇస్తుందో ఇప్పుడు తెలుసుకోండి..
ఛాతీ ఇన్ఫెక్షన్ లక్షణాలు..
దగ్గు: ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉంటే తీవ్రమైన దగ్గు వస్తుంది. అదే సమయంలో దగ్గుతోపాటు పసుపు శ్లేష్మం కూడా బయటకు రావచ్చు. కాబట్టి మీరు చాలా కాలంగా శ్లేష్మంతో కూడిన దగ్గుతో బాధపడుతుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: ఛాతీ ఇన్ఫెక్షన్ ఉంటే శ్వాస వేగంపై కూడా ప్రభావితం చేస్తుంది. ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉంటే శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను అనుభవించవచ్చు. మరోవైపు శ్వాస తీసుకోవడంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
ఛాతీ నొప్పి: ఛాతీ నొప్పికి చాలా కారణాలు ఉండవచ్చు. ఛాతీ ఇన్ఫెక్షన్ కూడా దీనికి కారణం కావచ్చు. మీకు ఛాతీ ఇన్ఫెక్షన్ ఉంటే.. ఛాతీలో నొప్పి, మంట వస్తుంది.
తలనొప్పి: తలనొప్పి కూడా అనేక కారణాల వల్ల వస్తుంది. అయితే.. ఛాతీ నొప్పి లేదా ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉంటే.. తలనొప్పికి కారణం కావచ్చు. చాలా కాలంగా తలనొప్పితో బాధపడుతుంటే దానిని నిర్లక్ష్యం చేయకండి.. వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..