AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone: స్మార్ట్‌ఫోన్‌ను ఎలా పడితే అలా క్లీన్‌ చేస్తున్నారా..? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

How to clean your Smartphone: స్మార్ట్‌ఫోన్‌ను ఉత్తమమైన మార్గంలో శుభ్రం చేయాలనుకుంటే కొన్ని టిప్స్ పాటించడం మంచిదని టెక్నాలజీ నిపుణులు పేర్కొంటున్నారు.

Smartphone: స్మార్ట్‌ఫోన్‌ను ఎలా పడితే అలా క్లీన్‌ చేస్తున్నారా..? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Smartphone
Shaik Madar Saheb
|

Updated on: Aug 06, 2022 | 11:54 AM

Share

How to clean your Smartphone: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ జీవితంలో భాగంగా మారింది. స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఇప్పుడు ఏ పని కూడా జరగడం లేదు. అయితే.. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉత్తమమైన మార్గంలో శుభ్రం చేయాలనుకుంటే కొన్ని టిప్స్ పాటించడం మంచిదని టెక్నాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను పాలిష్ చేయడానికి ఉపయోగించే అనేక రకాల సాధనాలను కలిగి ఉంటే మంచిదంటున్నారు. కొంతమంది తప్పుడు పనిముట్ల సాయంతో వాటిని శుభ్రం చేసే పనిని చేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో స్మార్ట్‌ఫోన్ పాడైపోతుంది. మరలా మరమ్మత్తు చేయడానికి వేల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇలాంటి సమయంలో తప్పనిసరిగా మీతో ఉంచుకోవాల్సిన స్మార్ట్‌ఫోన్ క్లీనింగ్ టూల్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాల వల్ల స్మార్ట్‌ఫోన్ శుభ్రంగా ఉంటుంది.. ఎటువంటి నష్టం వాటిల్లదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మైక్రోఫైబర్ వస్త్రం: స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, దాని బాడీని సురక్షితంగా ప్రకాశవంతం చేయాలనుకుంటే ఇంట్లో పడి ఉన్న ఎటువంటి వస్త్రాలను ఉపయోగించకూడదు. ఎందుకంటే కొంతమంది అదే చేస్తారు. ఇంట్లో ఏదైనా పాత గుడ్డను ఉపయోగిస్తారు. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రం చేయడం ప్రారంభిస్తారు. కానీ ఇలా చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, బాడీ స్క్రాచ్ కావచ్చు లేదా దాని పెయింట్ పోతుంది. అందుకోసం ఎల్లప్పుడూ మైక్రోఫైబర్ క్లాత్‌ని ఉపయోగించాలి. అది మృదువుగా అలాగే దుమ్ము కణాలను బాగా గ్రహించి సెల్ ఫోన్‌ను మెరిసేలా చేస్తుంది.

ఆల్కహాల్ క్లీనర్: కొంతమంది స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రం చేయడానికి వాటర్ బేస్డ్ క్లీనర్‌ని ఉపయోగిస్తారు. కానీ అలా చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ పాడవుతుంది. వాస్తవానికి, వాటర్ క్లీనర్‌లు మీ స్మార్ట్‌ఫోన్‌లోకి వెళ్లి స్క్రీన్‌ను, ఫోన్‌ను స్తంభింపజేస్తాయి. దీని కారణంగా, డిస్ప్లే, మైక్రోఫోన్, స్మార్ట్‌ఫోన్ సర్క్యూట్‌ పాడవుతాయి. ఇలాంటి సమయంలో ఆల్కాహాల్‌ క్లీనర్‌ను ఉపయోగించడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..