Health Tips: ఈ వ్యక్తులు మామిడి పండ్లు తినేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి.. బీ కేర్‌ఫుల్!

ఏదైనా సరే మితంగా తింటేనే.. ఆరోగ్యానికి మంచిది.. ఒకవేళ ఆ హద్దు దాటిందో భారీ నష్టం చవి చూడాల్సిందే..

Health Tips: ఈ వ్యక్తులు మామిడి పండ్లు తినేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి.. బీ కేర్‌ఫుల్!
Mangoes
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 07, 2022 | 4:45 PM

పండ్లకు రారాజు మామిడి. వేసవిలో ఎక్కువగా దొరికే ఈ మామిడిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అమితంగా ఇష్టపడతారు. కొంతమంది పచ్చి మామిడికాయలను ఆవురావురుమంటూ లాగిస్తే.. మరికొందరు మామిడి పండ్లను జుర్రేస్తారు. ఇంకొందరికైతే రాత్రి భోజనం చేసిన తర్వాత మామిడి పండ్లను తినడం అలవాటు. మామిడి పండ్ల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే కొందరికి మాత్రం మామిడి తినడం చాలా ప్రమాదకరం. మరి ఆ వ్యక్తులు ఎవరు.? వారు మామిడి పండ్లు తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైనా సరే మితంగా తింటేనే.. ఆరోగ్యానికి మంచిది.. ఒకవేళ ఆ హద్దు దాటిందో భారీ నష్టం చవి చూడాల్సిందే. మామిడి పండ్లు కూడా ఇంతే.. మామిడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మెగ్నీషియం, కాపర్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఖాళీ కడుపుతో మామిడి పండ్లు తినడం.. అలాగే మధ్యాహ్నం భోజనం అనంతరం వీటిని తినడం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాని రాత్రి పడుకోబోయే ముందు మాత్రం మామిడిని తినకూడదట. ఆ సమయంలో మామిడి పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుందని డాక్టర్లు అంటున్నారు.

ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు.. వేసవి సీజన్‌లో మొదటిగా వచ్చే మామిడి పండ్లను తినకూడదు. ఎందుకంటే వాటిపై ఎక్కువగా రసాయనాలు చల్లుతారని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ఈ వ్యక్తులు తక్కువ మోతాదులో మామిడి పండ్లను తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్లు మామిడి పండ్లను భోజనం చేసేటప్పుడు తీసుకోకూడదట. ఒకవేళ తీసుకున్నట్లయితే.. షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. మరోవైపు ఏసిడిటీ సమస్య ఉన్నవారు కూడా ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం.. 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే