AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiwi Peel Benefits: కివీ పండు తొక్క తీసి పారేస్తున్నారా?.. మీరు చేసే అతి పెద్ద పొరపాటు ఇదే!

చాలామంది కివీ పండు అనగానే లోపల ఉండే పచ్చని గుజ్జును మాత్రమే ఇష్టంగా తింటారు. పైన ఉండే గోధుమ రంగు తొక్కను చూసి అసహ్యించుకుని పారేస్తుంటారు. కానీ, నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. కివీ తొక్కను పారేయడం అంటే సగానికి పైగా పోషకాలను వదులుకోవడమే! కివీ గుజ్జు కంటే దాని తొక్కలో 50 శాతం ఎక్కువ పీచు పదార్థం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

Kiwi Peel Benefits: కివీ పండు తొక్క తీసి పారేస్తున్నారా?.. మీరు చేసే అతి పెద్ద పొరపాటు ఇదే!
Benefits Of Eating Kiwi Peel
Bhavani
|

Updated on: Feb 23, 2026 | 10:24 PM

Share

విటమిన్ సి అధికంగా ఉండే పండల్లో కివి ముందు వరుసలో ఉంటుంది. అంతటి పోషకాలున్న ఈ పండు గుజ్జులోనే కాదు పై పొరలో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయట. కివీ తొక్క తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటి? ఆ పైన ఉండే పీచు ఇబ్బంది లేకుండా ఎలా తినాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. జీర్ణక్రియకు ప్రాణం:

కివీ తొక్కలో ఉండే అధిక పీచు పదార్థం పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని వదిలించడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.

2. రోగనిరోధక శక్తి పెంపు:

కివీ తొక్కలో విటమిన్ సి ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇందులోని యాంటీ మైక్రోబియల్ గుణాలు హానికర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడతాయి.

3. మెరిసే చర్మం:

వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో కివీ తొక్క అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్ ఇ చర్మం పొడిబారకుండా చూస్తుంది. కొంతమంది సహజ సౌందర్యం కోసం దీనిని ఫేస్ స్క్రబ్‌లలో కూడా ఉపయోగిస్తారు.

4. వ్యాధుల నుండి రక్షణ:

ఇందులోని ఫ్లేవనాయిడ్స్ శరీరంలో వాపును తగ్గిస్తాయి. గుండె జబ్బులు, మధుమేహం క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గించడంలో కివీ తొక్క సహాయపడుతుంది.

5. పర్యావరణానికి మేలు:

పండును పూర్తిగా తొక్కతో సహా తినడం వల్ల ఆహార వృధాను తగ్గించవచ్చు. ఇది పర్యావరణానికి మనం చేసే చిన్న సహాయం.

కివీ తొక్కపై ఉండే పీచు పోవాలంటే ఏం చేయాలి?

చాలామంది కివీ పైన ఉండే పీచు చూసి తినడానికి ఇష్టపడరు. కానీ దీన్ని సులభంగా తొలగించవచ్చు:

క్లీనింగ్: పండును తినేముందు వెజిటబుల్ బ్రష్ లేదా గరుకుగా ఉండే గుడ్డతో మెల్లగా రుద్ది కడిగితే పీచు పోతుంది.

గోల్డెన్ కివీ: సాధారణ కివీ కంటే ‘గోల్డెన్ కివీ’ తొక్క పలచగా ఉంటుంది మరియు పీచు తక్కువగా ఉంటుంది.

స్మూతీస్: కివీని తొక్కతో సహా ముక్కలుగా కోసి స్మూతీస్‌లో బ్లెండ్ చేస్తే పీచు అసలు తెలియదు.

Follow Us