AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయినే.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్

సస్పెన్స్, ట్విస్ట్‌లు, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే గత వారం ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఒకటిగా కొనసాగుతోంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అద్దిరిపోయాయని సినిమా చూసిన వారందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

OTT Movie: ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయినే.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Feb 23, 2026 | 9:56 PM

Share

ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలైతే మరీనూ. థియేటర్లు అయినా, ఓటీటీలయినా మలయాలం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కు షేక్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీనే. పలువురు స్టార్స్ నటించిన ఈ సినిమా గతేడాది నవంబర్ లో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో ఈ మూవీ మలయాళం ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి గానే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మేరీ ఫిలిప్ అనే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఒక క్రైమ్ షోను నడుపుతుంటుంది. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం ఆమె ఒక ప్రమాదకరమైన నేరస్థుడిని కలవడానికి వెళ్తుంది.

తన ఇంటర్వ్యూ ద్వారా ఆమోస్ అలెగ్జాండర్ మనస్తత్వాన్ని, అతని హత్యల వెనక ఉన్న రహస్యాలను బయటపెట్టాలనుకుంటుంది మేరీ. అయితే ఇంటర్వ్యూ మొదలయ్యాక ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఆమోస్ మేరీని తన మాటలతో భయ పెట్టడం ప్రారంభిస్తాడు. మరి మేరీ ఏమైంది? అసుల ఆమోస్ అలెగ్జాండర్ ఎవరు? హత్యలు ఎందుకు చేశాడన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ని చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..

ఈ మలయాళం థ్రిల్లర్ మూవీ పేరు ‘అమోస్ అలెగ్జాండర్’. అజు వర్గీస్, జాఫర్ ఇడుక్కి ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. దయానా హమీద్, కళాభవన్ షాజాన్, తారా జోసెఫ్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫ్రెండ్ పెళ్లిలో స్పెషల్‌గా కనిపించాలా? అబ్బాయిలు ఇవి ట్రై చేయండి
ఫ్రెండ్ పెళ్లిలో స్పెషల్‌గా కనిపించాలా? అబ్బాయిలు ఇవి ట్రై చేయండి
వాస్తు ప్రకారం.. ఇంట్లోకి కప్ప రావడం శుభమా? అశుభమా?
వాస్తు ప్రకారం.. ఇంట్లోకి కప్ప రావడం శుభమా? అశుభమా?
కస్టమర్ల వేషంలో వచ్చారు, కట్‌చేస్తే.. బంగారు ఉంగరాల ట్రేతో పరార్
కస్టమర్ల వేషంలో వచ్చారు, కట్‌చేస్తే.. బంగారు ఉంగరాల ట్రేతో పరార్
రైతు భరోసా నిధుల విడుదలపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రైతు భరోసా నిధుల విడుదలపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
అప్పుడు హీరో.. ఒక్క సినిమాతో మారిన కెరీర్..
అప్పుడు హీరో.. ఒక్క సినిమాతో మారిన కెరీర్..
నాలుగో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు.. స్టార్ ప్లేయర్లు దూరం
నాలుగో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు.. స్టార్ ప్లేయర్లు దూరం
బ్యాచిలర్స్ కోసం కేరళ చికెన్ రోస్ట్.. రుది అదిరిపోద్ది
బ్యాచిలర్స్ కోసం కేరళ చికెన్ రోస్ట్.. రుది అదిరిపోద్ది
ఏ గ్లాస్‌లో ఎక్కవ నీరు ఉన్నాయో 10 సెకన్లలో చెబితే మీరే తోపు
ఏ గ్లాస్‌లో ఎక్కవ నీరు ఉన్నాయో 10 సెకన్లలో చెబితే మీరే తోపు
ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరికి పొంచి ఉన్న ముప్పు
ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరికి పొంచి ఉన్న ముప్పు
ఆరోగ్యానికి శ్రీరామరక్ష ఈ రొట్టెలు..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యానికి శ్రీరామరక్ష ఈ రొట్టెలు..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు