AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సీరియల్ కిల్లర్‌గా మొసలి.. ఓటీటీకి వచ్చేసిన భయానక క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో ఏకంగా 9.8 రేటింగ్

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఉంది. టీజర్స్, ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు ఐఎమ్ డీబీలో ఏకంగా 9.8 రేటింగ్ ఉండడం గమనార్హం.

OTT Movie: సీరియల్ కిల్లర్‌గా మొసలి.. ఓటీటీకి వచ్చేసిన భయానక క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో ఏకంగా 9.8 రేటింగ్
Raakshasa Web Series
Basha Shek
|

Updated on: Feb 22, 2026 | 7:38 PM

Share

ప్రస్తుతం థియేటర్లయినా, ఓటీటీలైనా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇక ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ప్రతి వారం ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇతర భాషల్లో హిట్ అయిన వాటిని కూడా ఆయా భాషల్లోకి డబ్బింగ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. అలా ఈ వారం కూడా ఇక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. సుమారు 25 నిమిషాల రన్‌టైమ్‌తో ఏడు ఎపిసోడ్స్ ఉన్న రాక్షస వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సినిమా చూసిన వారందరూ ఐఎమ్ డీబీలో ఏకంగా 9.8 రేటింగ్ ఇచ్చి టాప్‌లో ఉంచారు. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఒక మొసలి, ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ సాగుతుంది. నది ఒడ్డున ఉండే గ్రామంలో వరుసగా హత్యలు జరుగుతాయి. వీటిని సీరియల్ కిల్లర్ చేస్తున్నాడా, లేదా మొసలి చంపుతుందా? అనేది చివరి వరకు తెలియకుండా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. అదే సమయంలో సమీపంలోని ఒక పోలీస్ స్టేషన్ లో వరుసగా మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. మరి వారంతా ఏమయ్యారు? అసలు ఎలాంటి ఆనవాళ్లు, గుర్తులు లేకుండా వారు ఎలా మాయమయ్యారు? ఇది నిజంగా మొసలి దాడివల్ల జరుగుతుందా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? మరి పోలీసులు ఈ క్రైమ్ మిస్టరీని ఎలా ఛేదించారు? అన్నది తెలుసుకోవాలంటే ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.

2022లో వచ్చిన సూపర్ హిట్ తమిళ వెబ్ సిరీస్ ‘విలంగు’ ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించచారు.  హిందీలో కూడా ఇది ‘జానవర్’ పేరుతో  ఇది రీమేక్ అయ్యింది. ఇప్పుడు కన్నడలో ‘రాక్షస’గా వచ్చింది. సుహాన్ ప్రసాద్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్ర పోషించారు. మయూరి క్యాతరి, అప్పన్న రామదుర్గ, అవినాష్, జహంగిర్ ఎమ్ఎస్, అభిజిత్, హులుగప్ప కత్తిమని, మహాదేవ్ హడాపద్, సుష్మిత జగప్ప తదితరులు ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం కేవలం కన్నడలో మాత్రమే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీకెండ్ లో మంచి థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునేవారికి ఇదొక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

జీ5లో రాక్షస స్ట్రీమింగ్

రాక్షస వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పవర్‌హౌస్ కాదు భయ్యో.. వీళ్లంతా కోల్‌కతా కంత్రీగాళ్లు
పవర్‌హౌస్ కాదు భయ్యో.. వీళ్లంతా కోల్‌కతా కంత్రీగాళ్లు
తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. వెంటనే అప్లై చేయండ
తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. వెంటనే అప్లై చేయండ
కుటుంబంలో ఒకటిగా ఉన్న గోమాత.. తెల్లారేసరికల్లా విగతజీవిగా..!
కుటుంబంలో ఒకటిగా ఉన్న గోమాత.. తెల్లారేసరికల్లా విగతజీవిగా..!
ఇళ్లకు PNGని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత?
ఇళ్లకు PNGని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత?
తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
రూ. 11.75 కోట్ల జీతం.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కొట్టలే
రూ. 11.75 కోట్ల జీతం.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కొట్టలే
గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులకు కేంద్రం గుడ్‌న్యూస్!
గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులకు కేంద్రం గుడ్‌న్యూస్!
ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!
ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!
హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!
హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!
ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాగ్
ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాగ్