AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీలోకి వచ్చేస్తోన్న ‘మన శంకరవరప్రసాద్ గారు’.. మెగాస్టార్ 400 కోట్ల సినిమా టెలికాస్ట్ ఎప్పుడు, ఎక్కడంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 400 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టిన ఈ మెగా మూవీ ఇప్పుడు టీవీలోకి రానుంది.

టీవీలోకి వచ్చేస్తోన్న 'మన శంకరవరప్రసాద్ గారు'.. మెగాస్టార్ 400 కోట్ల సినిమా టెలికాస్ట్ ఎప్పుడు, ఎక్కడంటే?
Mana Shankara Vara Prasad Garu Movie
Basha Shek
|

Updated on: Feb 22, 2026 | 6:44 PM

Share

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 400 కోట్ల మేర కలెక్షన్లు సాధించి రీజినల్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా థియేటర్లు, ఓటీటీలో రికార్డులు కొల్లగొట్టిన మన శంకరవరప్రసాద్ గారు ఇప్పుడు మన ఇంటికి వచ్చేస్తున్నారు. అదే నండి టీవీ ప్రీమియర్స్‌ కు రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులతో పాటు శాటిలైట్ హక్కులు కూడా జీ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన శంకరవరప్రసాద్ గారు బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. వచ్చే శనివారం ( ఫిబ్రవరి 28)న సాయంత్రం 5:30 కి ఈ బ్లాక్ బస్టర్ మూవీ ప్రసారం కానుంది. ఈ మేరకు జీ తెలుగు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కాగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల సంయుక్తంగా ‘మనశంకర వరప్రసాద్‌గారు’ సినిమాను నిర్మించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. వీరితో పాటు క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు ఈ సినిమాలో తళుక్కుమన్నారు. ఇక భీమ్స్ అందించిన పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలకు..

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పవర్‌హౌస్ కాదు భయ్యో.. వీళ్లంతా కోల్‌కతా కంత్రీగాళ్లు
పవర్‌హౌస్ కాదు భయ్యో.. వీళ్లంతా కోల్‌కతా కంత్రీగాళ్లు
తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. వెంటనే అప్లై చేయండ
తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. వెంటనే అప్లై చేయండ
కుటుంబంలో ఒకటిగా ఉన్న గోమాత.. తెల్లారేసరికల్లా విగతజీవిగా..!
కుటుంబంలో ఒకటిగా ఉన్న గోమాత.. తెల్లారేసరికల్లా విగతజీవిగా..!
ఇళ్లకు PNGని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత?
ఇళ్లకు PNGని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత?
తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
రూ. 11.75 కోట్ల జీతం.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కొట్టలే
రూ. 11.75 కోట్ల జీతం.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కొట్టలే
గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులకు కేంద్రం గుడ్‌న్యూస్!
గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులకు కేంద్రం గుడ్‌న్యూస్!
ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!
ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!
హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!
హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!
ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాగ్
ఓటీటీలో టాప్ ట్రెండింగ్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాగ్