AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: సాయి పల్లవిని చుట్టుముట్టిన అభిమానులు.. తెలివిగా తప్పించుకున్న లేడీ పవర్ స్టార్.. వీడియో

ఈ మధ్యన పబ్లిక్ ఈవెంట్స్ లో కొందరు హీరోయిన్లకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, సమంత తదితర హీరోయిన్లతో ఫొటోలు, వీడియోలు దిగేందుకు ఫ్యాన్స్ తీవ్ర అత్యుత్సాహం చూపారు. దీంతో ఈ ముద్దుగుమ్మలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

Sai Pallavi: సాయి పల్లవిని చుట్టుముట్టిన అభిమానులు.. తెలివిగా తప్పించుకున్న లేడీ పవర్ స్టార్.. వీడియో
Sai Pallavi
Basha Shek
|

Updated on: Feb 22, 2026 | 5:28 PM

Share

అభిమానుల అత్యుత్సాహంతో ఇటీవల కొందరు సినిమా తారలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిధి అగర్వాల్, సమంత, మొన్నటికి మొన్న రామ్ చరణ్ తన కూతురుతో క్లింకారతో వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. తాజాగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఇలాంటి సిచ్యువేషనే ఎదురైంది. ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అభిమానులు తెగ పోటీ పడ్డారు. అయితే న్యాచురల్ బ్యూటీ మాత్రం తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. దీనిని గమనిస్తుంటే ఏదో సినిమా షూటింగ్ విరామ సమయంలో జరిగినట్లు కనిపిస్తోంది. కొందరు అభిమానులు సాయి పల్లవిని చుట్టు ముట్టి ఫొటోలు, సెల్ఫీలు కావాలని అడిగేశారు. వారి ఉత్సాహాన్ని కాదనలేక న్యాచురల్ బ్యూటీ కూడా ఇద్దరు, ముగ్గురికి ఫొటోలు ఇచ్చి వెంటనే అక్కడి నుంచి జంప్ అయిపోయింది. అభిమానులకు చిక్కకుండా జెట్ స్పీడ్ లో అక్కడి నుంచి కారు దగ్గరకు వెళ్లిపోయింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సాయి పల్లవిని పట్టడం ఎవరి వల్ల కాదు బాబోయ్!” అని ఒకరు కామెంట్ చేస్తే ఇంకొకరు “భలే తప్పించుకున్నావు” అంటూ సరదాగా కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సాయి పల్లవి వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటోంది. గత ఏడాది నాగ చైతన్యతో కలిసి ఆమె నటించిన ‘తండేల్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ రామయాణంలో సీతగా నటిస్తోందీ అందాల తార. అలాగే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో కలిసి ఏక్ దిన్ అనే మరో సినిమాలోనూ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది మే 1న ఏక్ దిన్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక రామయాణం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

నెటిజన్ల క్రేజీ కామెంట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..
ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..