AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 18 నెలలు పక్షవాతానికి గురై ఇండస్ట్రీకి దూరం.. ఇప్పుడు 3300 కోట్లకు అధిపతి..

ఒకప్పుడు అందరి హృదయాలను దోచుకున్న చాక్లెట్ బాయ్ అతడు. తొలినాళ్లల్లోనే కెరీర్ శిఖరాగ్రానికి చేరుకున్నాడు. కానీ వరుస హిట్లతో దూసుకుపోతున్న సమయంలోనే వెన్నెముక గాయం కారణంగా 18 నెలలు పక్షవాతానికి గురయ్యాడు. ఎదురుదెబ్బలను అధిగమించి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన అతడు ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

Tollywood : అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 18 నెలలు పక్షవాతానికి గురై ఇండస్ట్రీకి దూరం.. ఇప్పుడు 3300 కోట్లకు అధిపతి..
Arvind Swamy
Rajitha Chanti
|

Updated on: Feb 23, 2026 | 9:50 PM

Share

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ అంటే ఠక్కున గుర్తొచ్చే హీరోలలో అతడు ఒకరు. కెరీర్ మొదట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడు అరవింద్ స్వామి జీవితం కేవలం సినిమా కథ కంటే ఎక్కువ. ఒకప్పుడు ఆయన అందరి హృదయాలను దోచుకున్న చాక్లెట్ బాయ్. రోజా, బాంబే వంటి అనేక హిట్ చిత్రాలతో భారీ అభిమానులను సంపాదించుకున్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఎన్నో హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఆ స్టార్ కొంతకాలం సినిమాను విడిచిపెట్టాల్సి వచ్చింది. కానీ తరువాత అరవింద్ స్వామి జీవితంలోని ఆ ఎదురుదెబ్బలను విజయంగా మార్చుకున్నాడు. అరవింద్ స్వామి తొంభైలలో ‘రోజా’ ‘బాంబే’ వంటి చిత్రాలతో పాన్-ఇండియన్ స్టార్‌గా మారాడు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు, 2005లో వెన్నెముక గాయం అరవింద్ స్వామిని పాక్షికంగా పక్షవాతం బారిన పడ్డాడు. గతంలో కొన్ని రోజుల క్రితం ఇటీవల మెల్‌బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆ కాలంలో తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక ఇబ్బందుల గురించి మాట్లాడారు. గాయం తర్వాత అరవింద్ స్వామి దాదాపు ఏడాదిన్నర పాటు మంచానికే పరిమితమయ్యారు. శస్త్రచికిత్స చేయకూడదని నిర్ణయించుకున్నందున నొప్పిని భరించాడు. “నేను ఒక సంవత్సరం ఆరు నెలలుగా చాలా నొప్పితో బాధపడ్డాను, నేను నడవలేకపోయాను” అని అరవింద్ స్వామి ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

అతను శస్త్రచికిత్సకు సిద్ధమవుతుండగా, నటుడు ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిశాడు. “ఆయన నన్ను కేవలం మూడు రోజుల చికిత్స ద్వారానే బయటపెట్టారు. ఆయుర్వేదం పురాతన జ్ఞానం నాకు ఫలితాలను ఇచ్చింది. ఇది నా వ్యక్తిగత అనుభవం, అందరూ ఒకే మార్గాన్ని తీసుకోవాలని నేను చెప్పడం లేదు” అని అరవింద్ స్వామి అన్నారు. 2000లో, అరవింద్ స్వామి నటనకు విరామం ఇచ్చి తన తండ్రి వ్యాపారాన్ని చేపట్టాడు. 2005లో, అతను టాలెంట్ మాగ్జిమస్ అనే కంపెనీని స్థాపించాడు. 2016 నాటికి, అరవింద్ స్వామి దుస్తుల మార్కెట్‌లోకి కూడా ప్రవేశించారు. స్వామి మీడియా, వినోద సంస్థ అయిన ఇక్సోరా మీడియాను కూడా స్థాపించారు. కోయంబత్తూరులో కార్యాలయాలు కలిగిన భారతీయ రియల్ ఎస్టేట్ సంస్థ కోవై ప్రాపర్టీ సెంటర్ కూడా అరవింద్ స్వామి వ్యాపారంతో ముడిపడి ఉంది. ప్రస్తుతం తన టాలెంట్ మాగ్జిమస్ కంపెనీ విలువ రూ.3300 కోట్లు అని సమాచారం. 2013లో, అతను మణిరత్నం చిత్రం కాదల్ తో తిరిగి నటనలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు తెలుగు, తమిళం భాషలలో నటిస్తున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

Arvind Swamy Movies

Arvind Swamy Movies

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

Follow Us