AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడిగుడ్డుని మించి ప్రొటీన్ ఇచ్చే దేశీ టిఫిన్స్ ఇవే! జిమ్‌కు వెళ్లేవారు తింటే కండరాల పుష్టి గ్యారెంటీ!

ఆరోగ్యకరమైన అల్పాహారం అనగానే చాలామందికి మొదటగా గుర్తొచ్చేది కోడి గుడ్డు మాత్రమే. ప్రొటీన్ కావాలంటే గుడ్లు తినాల్సిందే అనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. అయితే, క్యాలరీ చార్టులు, ఫిట్‌నెస్ యాప్‌లు రాకముందు నుండే మన భారతీయ వంటిళ్లు ప్రొటీన్ల గనిగా ఉన్నాయి.

కోడిగుడ్డుని మించి ప్రొటీన్ ఇచ్చే దేశీ టిఫిన్స్ ఇవే! జిమ్‌కు వెళ్లేవారు తింటే కండరాల పుష్టి గ్యారెంటీ!
Protien Breakfast.jpg
Nikhil
|

Updated on: Feb 23, 2026 | 10:21 PM

Share

పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలతో చేసే మన సంప్రదాయ బ్రేక్ ఫాస్ట్ వంటకాలు కోడిగుడ్డుకు ఏమాత్రం తీసిపోవు సరికదా, అంతకంటే ఎక్కువ ప్రొటీన్లను, శక్తిని అందిస్తాయి. ఆ పోషక విలువల గురించి వివరించే ప్రత్యేక కథనం ఇక్కడ ఉంది:

శరీర బరువులో ప్రతి కిలోకు కనీసం 0.8 నుండి 1 గ్రాము ప్రొటీన్ ప్రతిరోజూ అవసరం. అంటే 60-70 కిలోల బరువున్న వ్యక్తికి రోజూ 48 నుండి 70 గ్రాముల ప్రొటీన్ కావాలి. దీనిని రోజంతా ముక్కలు ముక్కలుగా తీసుకోవడం కంటే, ఉదయమే ప్రొటీన్ నిండుగా ఉన్న అల్పాహారంతో మొదలుపెట్టడం వల్ల కండరాలు దృఢంగా మారడమే కాకుండా, మాటిమాటికీ ఆకలి వేయకుండా ఉంటుంది. ప్రొటీన్ కోసం విదేశీ వంటకాల వైపు చూడాల్సిన పనిలేదు.. మన అమ్మ చేసే ఈ సంప్రదాయ వంటకాల్లో ప్రొటీన్ ఏ స్థాయిలో ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

గుడ్డుకు పోటీ ఇచ్చే దేశీ అల్పాహారాలు

  1.  బేసన్ చీలా ‌‌- శనగపిండితో చేసే ఈ అట్లు ఎంతో రుచిగా ఉంటాయి. ఒక సర్వింగ్‌లో దాదాపు 12-14 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. దీనికి పెరుగు జత చేసినా లేదా పనీర్ స్టఫింగ్ చేసినా ప్రొటీన్ పరిమాణం మరింత పెరుగుతుంది.
  2. పనీర్ బుర్జీ, మల్టీగ్రెయిన్ రోటీ-ఉల్లిపాయలు, టమాటాలు, మసాలాలతో చేసే పనీర్ బుర్జీలో 18-20 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. దీనిని మల్టీగ్రెయిన్ రోటీతో తీసుకుంటే రోజంతా కావాల్సిన శక్తి లభిస్తుంది.
  3. పెసరట్టు – పెసరపప్పును నానబెట్టి చేసే ఈ అట్లు తేలికగా అరగడమే కాకుండా, రెండు మీడియం సైజు అట్ల నుండి 14-16 గ్రాముల ప్రొటీన్ అందుతుంది.
  4. మొలకెత్తిన పెసల సలాడ్- మొలకెత్తిన పెసలను లైట్ గా తాలింపు వేసి తీసుకుంటే ఒక గిన్నెలో 14-15 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
  5. పల్లీల పోహా -అటుకుల ఉప్మాలో వేయించిన పల్లీలను ఎక్కువగా చేర్చడం వల్ల ప్రొటీన్ పరిమాణం 11-13 గ్రాములకు చేరుతుంది. ఇది త్వరగా తయారయ్యే పోషకాహారం.
  6. సత్తు పరాటా -వేయించిన శనగపిండి (సత్తు)ను స్టఫింగ్ గా వాడి చేసే ఈ పరాటాలో 15-17 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది కడుపు నిండుగా ఉంచి, శక్తిని ఇస్తుంది.
  7. అడై దోశ-కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటి వివిధ రకాల పప్పులతో చేసే ఈ దోశలో 16-18 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి.

ప్రొటీన్ కోసం అలవాటు లేని ఆహారం వైపు వెళ్లాల్సిన అవసరం లేదు. మన సంప్రదాయ వంటకాల్లోనే రుచితో పాటు పుష్కలమైన పోషకాలు ఉన్నాయి. ఈ అల్పాహారాలు ఫైబర్ ను కూడా అందిస్తాయి, ఇది గుడ్లలో లభించదు.

Follow Us