Adulterated Milk: జాగ్రత్త! తెల్లనివన్నీ పాలు కావు.. కిడ్నీలను పిండేసే కెమికల్స్
పాలు తాగను అని మారాం చేసే పిల్లలకి.. ఎన్నివిధాలుగా ప్రయత్నించి నోట్లో పోస్తారో పేరెంట్స్. అవి కల్తీ పాలు అయితే...? మీరు తాగించేది అమృతం కాదు.. కాలకూట విషం అయితే? పైగా.. జబ్బు చేసినప్పుడల్లా.. పిల్లలు బయటేవో కొనుక్కుతింటున్నారని పేరెంట్సే అబాండాలు వేస్తారు. 'నిజం చెప్పు.. తిన్నావ్ కదా' అంటారు. అయ్యో.. వాళ్ల కడుపులోకి రోజూ గ్లాసుడు విషాన్ని నింపుతున్నదే పేరెంట్స్. 'ప్యాకెట్ పాలు కాదు తాగేది.. రోజూ ఇంటికొచ్చి పోస్తారు' అని గొప్పగా చెప్పుకుంటారు గానీ.. అవి కల్తీ పాలు కావని మీకెలా తెలుసు? రాజమండ్రి కల్తీ పాలన ఘటనలో అదే జరిగింది. పాలు పోయించుకుంటున్న వాళ్ల ఇళ్లల్లోనే మరణమృదంగం మొదలైంది.

యూరియా, ఫార్మాలిన్, పామాయిల్.. ఇలాంటి చెత్తాచెదారం కలిపినా సరే ఆ పాలు తోడుకుంటాయా? పాలు కాస్తున్నప్పుడు విరిగిపోకుండా ఉంటాయా అసలు? ఈ డౌట్ వచ్చిందా ఎవరికైనా? విరిగిపోతే.. మీరు పసిగట్టేస్తారు కదా. అందుకే పాలు విరగకుండా ఓ కెమికల్ కలుపుతారు. మరి.. యూరియా కలిపిన పాలు ఎలా తోడుకుంటుంది? దానికీ ఓ కెమికల్ కలుపుతారు. సో, ఎక్కడా పాలు విరిగిపోవడం గానీ, పెరుగు తోడుకోకపోవడం గానీ ఉండదు. అలా జరిగితే కనిపెట్టేస్తారు కదా. ఎలాంటి తేడా కనిపించదు కాబట్టే అవి మంచి పాలు అనే భ్రమలో తాగేస్తున్నారు, ఆ పెరుగుతోనే కమ్మగా భోంచేస్తున్నారు. కాని, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా. ఒకసారి రాజమండ్రిలో ఏం జరిగిందో చూడండి. శివరాత్రి రోజున.. రోజులాగే పాలు పోశాడు వ్యాపారి. పైగా ఆరోజు ఉపవాసం ఉంటారుగా. కాస్త ఎక్కువ పాలే తీసుకున్నారు. బట్.. ఆరోజు ఇంటికొచ్చిన పాలు చేదుగా, ఒకరకమైన వాసన వచ్చింది. తాగినవాళ్లు అదే చెప్పారు. పెరుగు కూడా తేడా కొట్టింది. సరిగ్గా వారం తరువాత నుంచి ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. ఈ ఘటనలో తాడి రమణి, తాడి కృష్ణవేణి, రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావు మరణించారు. ప్రాణాలు పోయాయనే చెప్పుకున్నాం గానీ.. ప్రాణం పోయే ముందు వీళ్లు పడ్డ నరకయాతన ఎలాంటిదో తెలుసా. ఒకటే వాంతులు. తింటున్నారు, తాగుతున్నారు గానీ టాయిలెట్ రావడం లేదు. పైగా పొట్ట ఉబ్బరం. దీన్నే అనూరియా అంటారు వైద్యపరిభాషలో. అంటే...
