Viral: భర్త చిన్ననాటి ఆల్బమ్ తిరగేసిన భార్య.. అందులో ఒక ఫోటో చూడగానే మైండ్ బ్లాంక్!

ఓ మహిళ తన భర్త చిన్ననాటి ఫోటో ఆల్బమ్‌ను తిరగేస్తోంది. అందులో ఆమె ఓ ఫోటో చూడగానే దెబ్బకు స్టన్ అయ్యింది.

Viral: భర్త చిన్ననాటి ఆల్బమ్ తిరగేసిన భార్య.. అందులో ఒక ఫోటో చూడగానే మైండ్ బ్లాంక్!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 06, 2022 | 8:00 PM

ఓ మహిళ తన భర్త చిన్ననాటి ఫోటో ఆల్బమ్‌ను తిరగేస్తోంది. అందులో ఆమె ఓ ఫోటో చూడగానే దెబ్బకు స్టన్ అయ్యింది. అసలు ఇదెలా సాధ్యమైందో ఆమె ఊహకు అందట్లేదు. ఇంతకీ ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

వివరాల్లోకి వెళ్తే.. ఈక్వెడార్‌కు చెందిన ఐలిజ్ మెలినా కొద్దిరోజుల క్రితం తన అత్తగారింటికి వెళ్లింది. అక్కడ ఆమెను తన భర్త పెడ్రో చిన్ననాటి ఫోటోలను చూపించమని కోరింది. అనంతరం ఆ ఫోటో ఆల్బమ్‌ను తిరగేస్తుండగా మెలినా అందులో ఓ ఫోటోను చూసి దెబ్బకు షాకైంది. అసలు ఇదెలా సాధ్యమైందో ఆమెకు అర్ధం కాలేదు. ఎందుకంటే.. ఆ ఫోటోలో తన భర్త వెనుక ఆమె కూడా ఉంది. ఏదొక పరేడ్‌ జరుగుతున్న సమయంలో తన భర్త చిన్నప్పుడు ఆ ఫోటో తీసుకోగా.. అందులో ఆమె కూడా ఉంది. అప్పుడు వీరిద్దరికీ అస్సలు పరిచయం లేదు. అందుకే ఆ ఫోటోలో తనను తాను చూసుకుని మెలినా ఆశ్చర్యపోయింది.

‘ఆ ఫోటో చూడగానే నేను, నా భర్త ఆశ్చర్యపోయాం. భయం, ఆనందం, ఆశ్చర్యం.. ఇలా అనేక భావోద్వేగాలు ఒకేసారి వచ్చాయి. ఓ పరేడ్‌లో నా భర్త తీసుకున్న ఫోటో అది. అందులో నేను కూడా భాగం కావడమన్నది నమ్మశక్యం కావట్లేదు. నాకు అసలు ఆ పరేడ్, ఈ ఫోటో గురించి ఏం గుర్తులేదు. అప్పుడు అతనెవరో నాకు తెలియదు. 17 సంవత్సరాలు వచ్చేవరకు నేను పెడ్రోను కలవలేదు. ఆ తర్వాతే అతడు నాకు తెలుసు’ అని మెలినా చెప్పుకొచ్చింది. కాగా, మెలినా, పెడ్రో యూనివర్సిటీ సమయంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.

1

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..