AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: శృంగార సామర్ధ్యం పెరుగుతుందంటూ తేనె అమ్మకం.. తీరా అసలు విషయం ఆరా తీయగా ఫ్యూజులౌట్!

ఆరోగ్యానికి తేనె చాలా ఉపయోగకరం. ఆయుర్వేదంలో కూడా తేనె వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతారు...

Viral: శృంగార సామర్ధ్యం పెరుగుతుందంటూ తేనె అమ్మకం.. తీరా అసలు విషయం ఆరా తీయగా ఫ్యూజులౌట్!
Honey
Ravi Kiran
|

Updated on: Aug 06, 2022 | 8:46 PM

Share

ఆరోగ్యానికి తేనె చాలా ఉపయోగకరం. ఆయుర్వేదంలో కూడా తేనె వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే నాలుగు కంపెనీలు లైంగిక సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయంటూ తేనె సంబంధిత ఉత్పత్తులను అడ్డగోలుగా విక్రయిస్తున్నాయి. వాటి లేబుల్‌పై ఉండే ఔషధ పదార్ధాలు కాకుండా.. వేరే డ్రగ్స్‌ను ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నాయి. ఏజెన్సీ ల్యాబరేటరీ పరీక్షల్లో ఇది నిరూపితమవ్వడంతో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆయా నాలుగు కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది.

ఏయే కంపెనీలకు ఎఫ్‌డీఏ నుంచి వార్నింగ్ లెటర్స్ జారీ అయ్యాయి.?

ఓ నాలుగు కంపెనీలు ఉత్పత్తుల లేబుల్‌పై లేని ఔషధ పదార్ధాలైన వయాగ్రా, సియాలిస్‌లను ఉపయోగిస్తున్నట్లు ఏజెన్సీ ల్యాబరేటరీ గుర్తించింది. దీంతో ఎఫ్‌డీఏ ఆయా నాలుగు కంపెనీలకు వార్నింగ్ లెటర్స్ జారీ చేసింది. US Royal Honey LLC, MKS Enterprise LLC, Shopaax.com, Incorporated dba Pleasure Products USA కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నాలుగు కంపెనీల ఉత్పత్తులు వివిధ ఆన్‌లైన్ వెబ్‌సైట్లు, కొన్ని రిటైల్ దుకాణాలు, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో ‘లైంగిక మెరుగుదల నివారణలు’ అనే పేరిట విక్రయించబడుతున్నాయి. ప్రోడక్ట్‌లకు ‘Dose Vital Honey For Men,’ ‘Secret Miracle Royal Honey For Her,’ ‘Kingdom Honey Royal VIP’ లాంటి పేర్లు పెట్టి మార్కెట్‌లలో అమ్ముతున్నారు. అలాగే వాటి లేబుల్‌పై వయాగ్రా లేదా సియాలిస్‌లను ప్రచురించలేదని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది.

కాగా, వయాగ్రా(Viagra), సియాలిస్(Cialis) అంగస్తంభనతో బాధపడుతున్న వ్యక్తులకు చికిత్స చేయడానికి FDA ఆమోదించిన డ్రగ్స్. వీటిని కలిగి ఉన్న ఉత్పత్తులను లైసెన్స్ పొందిన ఆరోగ్య నిపుణుల మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. అనుకున్న మోతాదు మించి.. ఈ ఉత్పత్తులను వాడితే ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు చెబుతున్నారు.

Follow Us
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
మరికాసేపట్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు.. లింక్
మరికాసేపట్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు.. లింక్
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?