Viral Video: రైలెక్కిన దున్నపోతు.. హడలిపోయిన ప్రయాణికులు.. సంచలనంగా మారిన ఘటన

సాధారణంగా రైళ్లలో మనుషులే ప్రయాణిస్తారు. అయితే పెంపుడు జంతువులను ట్రైన్ (Train) లో తీసుకువెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అయితే ఓ రైలులో ప్యాసింజర్లతో పాటు ఓ దున్నపోతు...

Viral Video: రైలెక్కిన దున్నపోతు.. హడలిపోయిన ప్రయాణికులు.. సంచలనంగా మారిన ఘటన
Buffalo Train Journey
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 06, 2022 | 8:52 PM

సాధారణంగా రైళ్లలో మనుషులే ప్రయాణిస్తారు. అయితే పెంపుడు జంతువులను ట్రైన్ (Train) లో తీసుకువెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అయితే ఓ రైలులో ప్యాసింజర్లతో పాటు ఓ దున్నపోతు ప్రయాణించింది. ఇంకో విషయమేంటంటే ఆ దున్నపోతు ఒంటరిగానే జర్నీ చేసి.. కరెక్ట్ స్టేషన్ లో దిగింది. అసలు ఇది నిజమేనా అని అనుకుంటున్నారా.. ? నిజ్జంగా నిజం. జార్ఖండ్‌లోని (Jharkhand) మీర్జాచౌకి నుంచి సాహిబ్‌గంజ్‌కు వెళ్లే ఓ రైలులో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 12 మంది వ్యక్తులు దున్నపోతును మీర్జా చౌకి రైల్వేస్టేషన్‌ లో సాహిబ్‌గంజ్‌కు వెళ్లే ప్యాసింజర్‌ రైల్లోని ఒక బోగిలోకి ఎక్కించారు. కంపార్ట్‌మెంట్‌ ఎంట్రెన్స్‌ డోర్ వద్ద సీటు హ్యాండిల్‌కు కట్టేశారు. చివరి స్టేషన్‌ సాహిబ్‌గంజ్‌ లో దానిని కిందికి దించాలని చెప్పి వెళ్లిపోయారు.

అయితే బోగిలో దున్నపోతు ఉండడంతో ప్రయాణికులు ఆ రైలు పెట్టెను ఖాళీ చేసి వెళ్లిపోయారు. బోగీలో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి.. ఆ దున్నపోతు ఎలా ఎక్కిందనే విషయాన్ని వివరించాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గతంలో కూడా ఇలాంటి సరదా సంఘటన జరిగింది. పశ్చిమ బెంగ లోకల్ ట్రైన్‌లో ఓ వ్యక్తి తన గుర్రాన్ని ఎక్కించి తీసుకెళ్లాడు. పైగా ఆ రైలు రద్దీగా ఉంది. రద్దీగా డైమండ్ హార్బర్ లోకల్ ట్రైన్‌లో తన గుర్రాన్ని ఎక్కించుకుని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..