Tik Tok: యువతా ఊపిరి పీల్చుకో.. టిక్ టాక్ మళ్లీ వస్తోంది.. మరిన్ని ఫీచర్ లతో..

మనదేశంలో టిక్ టాక్ (Tik Tok) ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ అందులో వీడియోలు చూడడం లేదా వీడియోలు తీసి అప్ లోడ్‌ చేయడం అలవాటుగా మారింది చిన్నాపెద్దా, ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ టిక్...

Tik Tok: యువతా ఊపిరి పీల్చుకో.. టిక్ టాక్ మళ్లీ వస్తోంది.. మరిన్ని ఫీచర్ లతో..
Tik Tok Classes
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Aug 06, 2022 | 4:06 PM

మనదేశంలో టిక్ టాక్ (Tik Tok) ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ అందులో వీడియోలు చూడడం లేదా వీడియోలు తీసి అప్ లోడ్‌ చేయడం అలవాటుగా మారింది చిన్నాపెద్దా, ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ టిక్ టాక్ లోనే గంటలు గంటలు గడిపేశారు. ఇంకో అడుగు ముందుకేసి వారే టిక్ టాక్ వీడియోలు (Videos) చేసే స్థాయికి వెళ్లిపోయారు. ఇలా టిక్ టాక్ ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్స్ అయిన వారెందరో.. తమ లోని ప్రతిభను బయటకు తీసేందుకు టిక్ టాక్ ను నెటిజన్లు ఓ మంచి సాధనంగా మలుచుకున్నారు. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, జోక్స్ చేయడం, ఫన్నీ వీడియోలు చేయడం, వంటలు, విశేషాలు, చిట్కాలు, ఆరోగ్యం ఇలా అది ఇదీ అనే తేడా లేకుండా మునిగితేలారు. దీంతో చాలా మంది ఈ ప్లాట్‌ఫామ్‌పై స్టార్లుగా మారారు. టిక్‌ టాక్‌ స్టార్‌ అనే బిరుదును తెచ్చుకున్నారు.అయితే.. టిక్ టాక్ చైనా యాప్ కావడం, భారత్ చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో కేంద్రం టిక్ టాక్ ను నిషేధించింది. దేశభద్రతకు ముప్పు పొంచి ఉందనే నేపథ్యంలో ఈ యాప్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

టిక్‌టాక్‌ను కేంద్ర నిషేధించడంతో నెటిజన్లు ఇతర యాప్ లను వినియోగించుకోవడం ప్రారంభించారు. ఎంఎక్స్‌ టకాటాక్, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, చింగారి వంటి యాప్‌లు పాపులర్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ యాప్‌లలో యూజర్లు మళ్లీ వీడియోలను అప్ లోడ్‌ చేస్తున్నారు. కాగా.. టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ భారతీయ యూజర్లకు అదిరిపోయే న్యూస్‌ చెప్పింది. త్వరలోనే మళ్లీ ఈ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి