Telugu News Photo Gallery Ulcerative colitis problem can solve just add these fruits in your health care diet in telugu health tips
Ulcerative Colitis: అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే, ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోండి..
Ulcerative colitis problem: పొట్టలో అల్సర్లు పెరిగి, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్ర సమస్యలతో బాధపడుతున్నప్పుడు పొక్కులు ఏర్పడతాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
Health Care Tips
Follow us
పొట్టలో అల్సర్లు పెరిగి, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్ర సమస్యలతో బాధపడుతున్నప్పుడు పొక్కులు ఏర్పడతాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఏ పండ్లతో ఈ సమస్యను అధిగమించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్: పీచుపదార్థాల్లో అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉండే యాపిల్స్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే పొట్టలో అల్సర్ల సమస్యను అధిగమించవచ్చు. ఇందుకోసం రోజుకు కనీసం ఒక ఆపిల్ తీసుకోవాలి.
అరటిపండు: అరటిపండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు ఏ, బీ, సీ, ఈ, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అల్సర్ల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, చాలా కాలం పాటు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
స్ట్రాబెర్రీ: ఇది యాంటీఆక్సిడెంట్లు, అనేక పోషకాల పవర్ హౌస్‌గా పరిగణిస్తుంటారు. ఇందులో సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు. ఇది తక్కువ కేలరీల ఆహారం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పొట్టలో అల్సర్లను తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అవకాడో: ఇది పొటాషియం, విటమిన్-సి, విటమిన్ కె, ఫినోలిక్ సమ్మేళనం, ఫోలేట్, ఫైబర్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, బి-కాంప్లెక్స్ వంటి అవసరమైన విటమిన్లను కలిగి ఉన్న పండుగా పేర్కొంటారు. అందుకే దీనిని సూపర్‌ఫుడ్‌గా కూడా పరిగణిస్తారు. కడుపు కోసం ఆహారంలో చేర్చాలని నిర్ధారించుకోండి.