AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Prevention: ప్రతిరోజూ ఒక్క అరటిపండు తింటే చాలు.. క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు.. తాజా పరిశోధనలో సరికొత్త విషయాలు

Banana For Cancer Prevention: అరటిపండ్లు తినడం వల్ల క్యాన్సర్‌ను కూడా నివారించవచ్చన్న విషయం మీకు తెలుసా..? అవును.. మీరు చదివింది నిజమే.. అరటిపండ్లు తింటే

Cancer Prevention: ప్రతిరోజూ ఒక్క అరటిపండు తింటే చాలు.. క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు.. తాజా పరిశోధనలో సరికొత్త విషయాలు
Banana
Shaik Madar Saheb
|

Updated on: Aug 08, 2022 | 10:02 AM

Share

Banana For Cancer Prevention: అరటిపండు ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనది. అరటిపండులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని అనేక వ్యాధుల నుంచి మనల్ని సురక్షితంగా ఉంచుతాయి. చాలా మంది బరువు పెరగడానికి లేదా శరీరం దృఢంగా ఉండటానికి అరటిపండ్లు తింటారు. అయితే అరటిపండ్లు తినడం వల్ల క్యాన్సర్‌ను కూడా నివారించవచ్చన్న విషయం మీకు తెలుసా..? అవును.. మీరు చదివింది నిజమే.. అరటిపండ్లు తింటే క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని పరిశోధనలో వెల్లడైంది. ఇది వింటే మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు. కానీ అరటిపండ్లు మాత్రమే కాకుండా ఇతర నిరోధక పిండిపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు క్యాన్సర్‌ను నిరోధించడంలో మీకు సహాయపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అరటిపండు క్యాన్సర్ కు ఎలా చెక్ పెడుతుంది..? అనే విషయాలను పరిశోధన నుంచి అన్నీ వివరంగా తెలుసుకుందాం..

అధ్యయనం ఏం చెబుతోంది?

మెడికల్ న్యూస్ టుడే నివేదిక ప్రకారం.. రెసిస్టెంట్ స్టార్చ్ (RS) కార్బోహైడ్రేట్లలో పుష్కలంగా ఉంటుంది. ఈ పిండి పదార్ధాలు చిన్న ప్రేగు నుంచి జీర్ణం కానివి పెద్ద ప్రేగులకు చేరుతాయి. ఇది పెద్ద ప్రేగులలో జీర్ణమవుతుంది. రెసిస్టెంట్ స్టార్చ్‌లు అంటే.. తృణధాన్యాలు, అరటిపండ్లు, బీన్స్, బియ్యం, వండిన, చల్లబడిన పాస్తా మొదలైన మొక్కల ఆధారిత ఆహారాలు.

ఇవి కూడా చదవండి

ఇది స్టార్చ్ ఫైబర్‌లో భాగం, ఇది కొలొరెక్టల్ క్యాన్సర్, అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. UK న్యూ కాజిల్, లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అధ్యయనాలు నిరోధక స్టార్చ్ పౌడర్ కూడా లించ్ సిండ్రోమ్ ఉన్నవారిలో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని సూచిస్తున్నాయి.

రోజూ అరటిపండు తినడం వల్ల..

ప్రతిరోజూ 30 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని పరిశోధనలో తేలింది. 30 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ 1 పచ్చి అరటిపండుకు సమానం. పరిశోధనలో సుమారు 10 సంవత్సరాల పాటు అనుసరించిన తర్వాత డేటా సేకరించినట్లు పరిశోధకులు వెల్లడించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి