నేను రెడీ షూటింగ్ పూర్తి.. సమ్మర్లో విడుదల
దర్శకుడు త్రినాధరావు నక్కిన, హీరో హవీష్ కాంబినేషన్లో వస్తున్న నేను రెడీ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిఖిలా కోనేరు నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో విడుదల కానున్న ఈ సినిమా అవుట్‌పుట్‌పై యూనిట్ సంతృప్తి వ్యక్తం చేసింది. టాలీవుడ్లో కొందరు దర్శకులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.
టాలీవుడ్లో కొందరు దర్శకులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వారి నుంచి సినిమా వస్తుందంటే కడుపుబ్బ నవ్వుకోవచ్చని, కుటుంబంతో కలిసి చూడొచ్చని ప్రేక్షకులు నమ్ముతారు. అలాంటి దర్శకులలో త్రినాధరావు నక్కిన ఒకరు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, ధమాకా వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న త్రినాధరావు, ప్రస్తుతం నేను రెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హవీష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి పతాకంపై నిఖిలా కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. భారీ తారాగణం ఉన్న ఈ సినిమా అవుట్‌పుట్‌పై యూనిట్ సంతృప్తిగా ఉంది. వేసవిలో కుటుంబమంతా హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు త్రినాధరావు నక్కిన తెలిపారు. జీనియస్, రామ్ లీలా, 7 వంటి చిత్రాల తర్వాత హవీష్ నుంచి వస్తున్న సినిమా ఇది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనుమానపు భర్తపై భార్య కన్నెర్ర.. చివరికి ఇలా..
బొమ్మల కంపెనీ యజమాని ట్రంప్‌కు చుక్కలు చూపించాడు.!
ఇరాన్‌పై దాడులకుమా బేస్ వాడొద్దు ట్రంప్‌కు షాకిచ్చిన యూకే
రష్యా “కాంట్రాక్ట్ కిల్లింగ్’ వ్యూహం.. ఉక్రెయిన్‌కు పట్టుబడ్డ కిరాయి హంతకులు
స్పీడ్ రేసింగ్‌లో నాగచైతన్య.. టీమ్ కోసం రంగంలోకి అక్కినేని వారసుడు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

