బొమ్మల కంపెనీ యజమాని ట్రంప్‌కు చుక్కలు చూపించాడు.!
ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన భారీ సుంకాల విధానానికి అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓ బొమ్మల కంపెనీ పోరాటం ఈ తీర్పుకు కారణం. దిగుమతి సుంకాల వసూలు నిలిచిపోయినా, వసూలు చేసిన మొత్తాలు తిరిగి చెల్లించాలా అనేదానిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఈ తీర్పు ట్రంప్ ప్రభుత్వ ఆదాయ అంచనాలను తలకిందులు చేసే అవకాశం ఉంది.
ప్రపంచదేశాలపై విధించిన సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి మిత్ర దేశం, శత్రు దేశం అనే తేడా లేకుండా భారీస్థాయిలో సుంకాలు విధించారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్న కంపెనీలకు ఆ విధానాలు శరాఘాతమయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు వెనక ఒక బొమ్మల కంపెనీ పోరాటం ఉంది. సుంకాలతో మూసేయాల్సిన పరిస్థితి నుంచి.. అది మళ్లీ ఊపిరి పోసుకుంది. ఇల్లినోయీ కేంద్రంగా వ్యాపారం చేస్తోన్న లెర్నింగ్ రిసోర్సెస్ బొమ్మల కంపెనీ దిగుమతుల్లో మెజార్టీ వాటా చైనాదే. చైనా నుంచి ఎడ్యుకేషన్ టాయ్స్‌ను కొనుగోలు చేస్తోంది. లెర్నింగ్ రిసోర్సెస్ యజమాని రిక్ వోల్డెన్‌బర్గ్ గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరికొందరు పిటిషనర్లతో కలిసి.. ఈ చిన్న సంస్థ విజయం సాధించేవరకు ఏమాత్రం వెనక్కితగ్గకుండా తన న్యాయపోరాటం కొనసాగించింది. ‘‘ఇన్ని రోజుల ఇబ్బందికి ఈ తీర్పు ఊపిరినిచ్చింది. ఇక, ఈ ప్రభుత్వం తన దగ్గరి నుంచి తీసుకున్న దానికి రికార్డు ఉంది. తన డబ్బులు తనకు తిరిగిఇవ్వాలి. తను చేసింది రాజకీపరమైన పోరాటం కాదు. ఇది పన్నుల గురించి చేసింది. పన్నుల రూపంలో చెల్లించాల్సిన దానికంటే అమెరికన్లు అదనంగా కట్టారు. ఒక దేశం తన ఆదాయాన్ని పెంచుకోవాలంటే.. దానిపై చట్టసభ సభ్యులు చర్చించుకోవాలి’’ అని తొలి పిటిషన్‌దారుల్లో ఒకరైన వోల్డెన్‌బర్గ్ తెలిపారు. దిగుమతిదారుల నుంచి ఇప్పటివరకు అదనంగా వసూలుచేసిన సుంకాలను కంపెనీలకు తిరిగి చెల్లించాలా, వద్దా అనే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేయలేదు. అసలు ఆ విషయాన్నే ప్రస్తావించలేదు. అదనపు సుంకాల వసూలును నిలిపివేసినా, వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాల్సి వచ్చినా ట్రంప్ ప్రభుత్వ ఆదాయం అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇరాన్‌పై దాడులకుమా బేస్ వాడొద్దు ట్రంప్‌కు షాకిచ్చిన యూకే
రష్యా “కాంట్రాక్ట్ కిల్లింగ్’ వ్యూహం.. ఉక్రెయిన్‌కు పట్టుబడ్డ కిరాయి హంతకులు
స్పీడ్ రేసింగ్‌లో నాగచైతన్య.. టీమ్ కోసం రంగంలోకి అక్కినేని వారసుడు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

