AP Crime News: ఉలిక్కిపడిన నంద్యాల.. నడిరోడ్డుపై కానిస్టేబుల్‌పై బీరు బాటిళ్లతో దాడి.. ఆ తర్వాత కిడ్నాప్‌ చేసి..

నంద్యాలలో ‌డీఎస్పీ అఫీసులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేంద్రను.. ఆదివారం కొందరు కత్తులతో పొడిచి చంపారు. స్థానిక రాజ్ థియేటర్ సమీపంలో

AP Crime News: ఉలిక్కిపడిన నంద్యాల.. నడిరోడ్డుపై కానిస్టేబుల్‌పై బీరు బాటిళ్లతో దాడి.. ఆ తర్వాత కిడ్నాప్‌ చేసి..
Ap News
Follow us

|

Updated on: Aug 08, 2022 | 9:31 AM

Constable brutally murdered in Nandyala: అతనొక కానిస్టేబుల్.. ద్విచక్రవాహనానికి బ్యాగ్ కుట్టించుకోడానికి టైలరింగ్ షాపు వద్దకు వెళ్లాడు.. దీంతో అక్కడ మాటువేసిన దుండగులు.. అతన్ని వెంబడించి మరి చంపారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పట్టణంలో కలకలం రేపింది. నంద్యాలలో ‌డీఎస్పీ అఫీసులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేంద్రను.. ఆదివారం కొందరు కత్తులతో పొడిచి చంపారు. స్థానిక రాజ్ థియేటర్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కానిస్టేబుల్ సురేంద్రను బీర్ బాటిల్‌తో దాడి చేసి అటోలో కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి నేరుగా అటోలో పట్టణ శివారులోని చెరువు కట్ట బంగారుపుట్టపై కత్తులతో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తగాయాలైన కానిస్టేబుల్ ను అటోలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సురేంద్ర మృతి చెందాడు. కొందరు రౌడీషీటర్లు సురేంద్రపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తూన్నారు. రౌడీషీటర్ల కదలికలపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇబ్బందులు గురిచేస్తూన్నడనే కారణంతో హత్య చేశారా..? లేక మరేమైన ఇతర కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

సురేంద్ర హత్య ఘటన తెలుసుకున్న జిల్లా ‌ఎస్పి రఘువీర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. మృతుడు కానిస్టేబుల్ మృతదేహాన్ని పరిశీలించారు. హత్య ఘటనపై జిల్లా ఎస్పీ అప్పటికప్పుడు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసి దుండగులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్ ‌చేసిన సంఘటన స్థలంలో ఉన్న సిసి కెమెరాలను ఎస్పీ స్వయంగా డీఎస్పీ, సీఐలతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల అధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

మృతుడు సురేంద్ర గత కొన్నాళ్లుగా నంద్యాల డీఎస్పీ అఫీసులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అఫీసులో మంచి ఉద్యోగిగా అందరి ప్రశంసలు పొందాడు. అలాంటి వ్యక్తిని దుండగులు హత్య చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

నంద్యాల జిల్లాగా ఏర్పాడిన తర్వాత ప్రశాంతంగా ఉన్న పట్టణం.. కానిస్టేబుల్ హత్యతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏకంగా కానిస్టేబుల్ కత్తులతో పొడిచి చంపారని.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి