Janasena: రసవత్తరంగా రాజోలు రాజకీయాలు.. జనసేన అభ్యర్థి ఇతనే అంటూ వార్తలు.. కార్యకర్తల్లో ఉత్కంఠ

జనసేన పార్టీకి ఏకైక ఎమ్మెల్యేను అందించిన నియోజవర్గంగా రాజోలు నిలిచింది. అయితే జనసేన పార్టీలో గెలిచి అధికార వైసీపీలో కీలకపాత్ర పోషిస్తున్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. దీంతో ఎమ్మెల్యే రాపాక పై జానసైనికులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.

Janasena: రసవత్తరంగా రాజోలు రాజకీయాలు.. జనసేన అభ్యర్థి ఇతనే అంటూ వార్తలు.. కార్యకర్తల్లో ఉత్కంఠ
Razole Janasena
Follow us
Surya Kala

|

Updated on: Aug 08, 2022 | 9:16 AM

Janasena: ఆంధ్రపదేశ్ లో ఎన్నికల హీట్ ఎప్పుడో మొదలైంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో రాజకీయాలు వైసీపీ వెర్సస్ జనసేన అన్న చందంగా సాగుతున్నాయి. జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని.. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన జనసేన పార్టీ అభ్యర్ధికి విజయాన్ని అందించిన నియోజక వర్గం. జనసేన పార్టీకి ఏకైక ఎమ్మెల్యేలు అందించిన నియోజవర్గంగా నిలిచింది. అయితే జనసేన పార్టీలో గెలిచి అధికార వైసీపీలో కీలకపాత్ర పోషిస్తున్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.

దీంతో ఎమ్మెల్యే రాపాక పై జానసైనికులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నిజయోకవర్గంలో జనసేన అభ్యర్థి పై పుకార్లు సోషల్ మీడియా వేదికగా షికారు చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి.. ఓడిపోయిన బొంతు రాజేశ్వరావు.. తనకు అధిష్టానం సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ.. అధికారపార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. అంతేకాదు.. ఇప్పుడు ఆయన దృష్టి జనసేన వైపు పడినట్లు తెలుస్తోంది.

బొంతు రాజేశ్వరరావు ఈ నెల 15 వ తేదీన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారని విశ్వసనీయ సమాచారం. ఇది నిజం చేస్తూ.. ఆదివారం జరిగిన బొంతు రాజేశ్వరరావు పుట్టినరోజు వేడుక్కి.. జనసేన కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. బొంతు రాజేశ్వరరావు పుట్టిన రోజు వేడుకల్లో సందడి చేశారు. అయితే మరోవైఫు రాజోలు నియోజక వర్గం ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి మాజీ ఐఎఎస్ దేవ వరప్రసాద్ అంటూ నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వరప్రసాద్ జనవాణి కార్యక్రమం రూపకర్త..  ప్రజాసమస్యలపై మంచి అవగహన ఉన్న వ్యక్తి వరప్రసాద్.. కలెక్టర్ గా ఉన్న సమయంలో అనేక ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరం చేసిన ఘనత ఉంది. దీంతో రానున్న ఎన్నికల్లో జనసేన టికెట్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ దే అని సామాజికమధ్యంలో ప్రచారం కావడంతో కార్యకర్తలలో ఉత్కంఠత నెలకొంది. దీంతో అధిష్టానం వెంటనే స్పందించి.. రాజోలు జనసేన టిక్కెట్ ఎవరికనేది ఇప్పటికైనా ప్రకటించాలని    జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రాజోలులో బొంతుకు టికెట్ ఇస్తే జనసేన విజయం ఖాయమని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?