AP Weather Alert: ఏపీ వాసులకు అలెర్ట్.. 48 గంటల పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మత్య్సకారులు వేటకు వెళ్ళద్దని హెచ్చరిక

సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు.. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని  పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

AP Weather Alert: ఏపీ వాసులకు అలెర్ట్.. 48 గంటల పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మత్య్సకారులు వేటకు వెళ్ళద్దని హెచ్చరిక
Ap Weather Alert
Follow us
Surya Kala

|

Updated on: Aug 07, 2022 | 8:23 PM

AP Weather Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని దీంతో ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. సెంట్రల్ బేలో అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారి.. ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు.. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని  పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక.. మత్య్సకారులు వేటకు సముద్రంపైకి వెళ్లవద్దని సూచించింది.

ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తాదని చెప్ప్పారు. విశాఖ నగరం అంతటా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం సింహాచలం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.

ఉమ్మడి కర్నూలు నగరం, తెలంగాణ, ఉత్తర ప్రకాశం, నంద్యాల జిల్లా సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

విజయవాడ నగరంతో పాటు గుంటూరు, ఉభయగోదావరి, కృష్ణా, కోనసీమ జిల్లాల్లోని చెదురుమదురు ప్రాంతాల్లో రానున్న48 గంటలలో ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. చల్లటి వాతావరణం ఉంటుందని వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..