Janasena: మెగా బ్రదర్ నాగబాబుని కలిసిన నటుడు పృథ్వి… త్వరలో పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటన

తాడేపల్లిగూడెంకు చెందిన పృథ్వి అదే స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పృధ్వీకి టికెట్, నియోజకవర్గ కేటాయింపు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే పృథ్వి మాత్రం జనసేనలో చేరనున్నారని తెలుస్తోంది. 

Janasena: మెగా బ్రదర్ నాగబాబుని కలిసిన నటుడు పృథ్వి... త్వరలో పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటన
Prudhvi Join Jana Sena
Follow us
Surya Kala

|

Updated on: Aug 06, 2022 | 4:25 PM

Janasena: ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో ఫేమస్ అయిన ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు పృధ్వీ రాజ్ ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పృధ్వీరాజ్ శనివారం మెగా బ్రదర్ నాగబాబును కలిశారు. ఈ స‌మావేశంలో పృధ్వీ తాను జనసేన పార్టీలో చేరాలనుకుంటున్నట్లు నాగబాబుకు తెలియజేశారు. పృధ్వీ ప్రతిపాదనను అంగీకరించిన నాగబాబు జనసేనలోకి స్వాగతం పలికారు. ఈ భేటీ అనంతరం.. టీటీడీలో పదవి నుంచి బర్తరఫ్ అయ్యే వరకు వైఎస్సార్సీపీలో ఉన్న ప్రముఖ హాస్యనటుడు నాగబాబుతో భేటీ తర్వాత జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పవన్ ‘చాతుర్మాస్య దీక్ష’ లో ఉన్నారు. ఈ దీక్ష ముగిసిన అనంతరం.. పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సమయంలో పృద్వి జనసేనలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తాడేపల్లిగూడెంకు చెందిన పృథ్వి అదే స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పృధ్వీకి టికెట్, నియోజకవర్గ కేటాయింపు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే పృథ్వి మాత్రం జనసేనలో చేరనున్నారని తెలుస్తోంది.

గతంలో వైసీపీలో భాగమైన ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. పృధ్వీ రాజ్ కృషిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు ఎస్‌వీబీసీ చైర్మన్‌ పదవిని ఇచ్చారు. అయితే.. పృధ్వి అసభ్యకరమైన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పృధ్వీ ఇమేజ్‌ను దెబ్బతీసింది. తనపై కుట్ర అని ఆరోపిస్తూ SVBC వైసీపీకి రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు మెగా ఫ్యామిలీతో పాటు సినీ పరిశ్రమలోని ఇతరులపై చేసిన వ్యాఖ్యలకు పృధ్వీ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..