AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Roja: గోరంట్ల తప్పు చేసినట్లు తేలితే చర్యలు.. అలాంటి చదువురాని దద్దమ్మలకి జవాబు చెప్పాల్సిన పనిలేదంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు

ఎంపీ మాధవ్ తప్పు చేసి ఉంటే ఆయనపై ఖచ్చితంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటారన్నారని మంత్రి రోజా చెప్పారు. విచారణకు టైం ఉంటుంది. వీడియో ఫేక్ నా, నిజమైనదా అని తెల్చచడానికి టైం పడుతుంది. అంతవరకు వెయిట్ చేయాలని సూచించారు.

Minister Roja: గోరంట్ల తప్పు చేసినట్లు తేలితే చర్యలు.. అలాంటి చదువురాని దద్దమ్మలకి జవాబు చెప్పాల్సిన పనిలేదంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు
Minister Roja On Gorantla
Surya Kala
|

Updated on: Aug 07, 2022 | 4:57 PM

Share

Minister Roja: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై మంత్రి రోజా స్పందించారు. మాధవ్‌ రాజీనామా చేయాలంటే.. చంద్రబాబు, లోకేష్ ఇప్పటికి వందసార్లు రాజీనామా చేయాల్సి ఉండేదన్నారు. చంద్రబాబు పాలనలో 5 ఏళ్ల మైనర్ బాలికతో పాటు పిచ్చివాళ్లపై కూడా అత్యాచారాలు చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో ఆడపిల్లల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయన్నారు. కేసులు, ఎఫ్ఐఆర్ చేయలేదు. శిక్షలు కూడా వేయలేదు. టిడిపి నాయకులంతా ఎలాంటి వాళ్లో అందరికీ తెలుసన్నారు. గోరంట్ల ఎందుకు రాజీనామా చేయాలో చెప్పాలని వ్యాఖ్యానించారు. ఎంపీ మాధవ్ తప్పు చేసి ఉంటే ఆయనపై ఖచ్చితంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటారన్నారని మంత్రి రోజా చెప్పారు.

విచారణకు టైం ఉంటుంది. వీడియో ఫేక్ నా, నిజమైనదా అని తెల్చచడానికి టైం పడుతుంది. అంతవరకు వెయిట్ చేయాలని సూచించారు. సీఎం మహిళా పక్షపాతి. మహిళల రక్షణకు భద్రతతో పాటు వాళ్ళ ఆర్థికంగా నిలబెట్టేందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

చిన్నచిన్న యాంకర్లు కూడా కార్లు కొంటుంటే.. తాను లంచాలు తీసుకొని కారు కొన్నట్టు జనసేన పిచ్చి వెధవలు టిడిపి ఉన్మాదులు సర్క్యులేట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి రోజా.. అంతేకాదు తాను 150 సినిమాలు చేశానని.. జబర్దస్త్ షో కు ఎన్ని లక్షల రూపాయలు రెమ్మ్యునరేషన్ తీసుకున్నానో నా బ్యాంక్ ఖాతాలు, ఐటి రిటర్న్స్ చూస్తే తెలుస్తోందని వ్యాఖ్యానించారు. చదువు రాని దద్దమ్మలకు జవాబు చెప్పాల్సిన పనిలేదని మంత్రి ఆర్కే రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..