Tomato Price: టమాట రైతులకు భారీ షాక్‌.. భారీగా తగ్గిన ధర.. ప్రస్తుతం మార్కెట్ ధర ఎంతో తెలుసా..

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీగా పడిపోయాయి టమోటా ధరలు.  రైతన్నలకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అనంతపురంలో 15 కిలోల టమోటా బాక్సు.. కేవలం 60రూపాయలలోపే..

Tomato Price: టమాట రైతులకు భారీ షాక్‌.. భారీగా తగ్గిన ధర.. ప్రస్తుతం మార్కెట్ ధర ఎంతో తెలుసా..
Tomato Price
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 07, 2022 | 1:30 PM

రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది టమాట. ఒక్కోసారి సెంచరీకి చేరే కిలో టమాటా రేటు.. ఇప్పుడు నాలుగు రూపాయలకు పడిపోవడం.. రైతులకు షాకిచ్చింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీగా పడిపోయాయి టమోటా ధరలు.  రైతన్నలకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అనంతపురంలో 15 కిలోల టమోటా బాక్సు.. కేవలం 60రూపాయలలోపే ఉందంటే.. టమోటా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. అదే.. కక్కలపల్లి మార్కెట్లో టమాట పరిస్థితి మరీ దారుణంగా మారింది. కిలోకి ఒక్కరూపాయంటే కూడా కొనే దిక్కులేకుండా పోయింది. దీంతో రోడ్డుపైనే టమోటాను పారపోతున్నారు రైతులు. ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు లక్ష రూపాయల చొప్పున నష్ట పోయామంటున్న రైతులు.. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇక, కర్నూల్‌లోనూ భారీగా పతనమైంది టమాట ధర. రైతుల నుంచి 30కిలోల బాక్సును రూ. 40లకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. వినియోగదారులకు మాత్రం 10 నుంచి రూ. 14లకు విక్రయిస్తున్నారు. దీంతో ఆరుగాలం శ్రమించినా పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

మార్కెట్లకు లోడ్ల కొద్దీ టమోటా రావడంతోనే ఈ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మార్కెట్‌కు తీసుకురావడం కూడా వృథాగా భావించి… రోడ్లపైనే పారబోస్తున్నారు రైతులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..