Viral News: గజ్జల చప్పుళ్లు, గాజుల మోతలు.. పార్వతీపురం మన్యం జిల్లాలో వింత శబ్దాలు కలకలం.. వీడియో
పార్వతీపురం మన్యం జిల్లాలో వింత శబ్దాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పల పోలమ్మ గుడిలో గజ్జల చప్పుళ్లు, గాజుల మోతలు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటీ శబ్ద రహస్యం.?
Parvathipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లాలో వింత శబ్దాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పల పోలమ్మ గుడిలో గజ్జల చప్పుళ్లు, గాజుల మోతలు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటీ శబ్ద రహస్యం.? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్వతీపురంలోని నాయుడు వీధిలో ఉన్న ఇప్పల పోలమ్మ గుడి దగ్గర దృశ్యాలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏ పండగా లేదు.. జాతర అంతకంటే కాదు. కానీ ఈ గుడి దగ్గర చాలామంది గుమిగూడారు. ఒకసారి కింద ఇచ్చిన వీడియో చూడండి..
ఎంత మంది గుమిగూడారో చూడండి.. పైగా లోపల ఏదో జరుగుతున్నట్టు ఒకరినొకరు తోసుకుంటూ గేటు దగ్గరకు వెళ్తున్నారు. చెవులు గేటుకు దగ్గరగా పెట్టి ఏదో వింటున్నట్టు కనిపిస్తోంది. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా.. వింత శబ్దం. ఆ గుడిలో నుంచి శబ్దాలు వస్తున్నాయనే ప్రచారం. ఆ చెవినా, ఈ చెవినా పడి ఊరంతా పాకింది. ఇంకేముంది అందరూ ఇలా పొలోమంటూ గుడి దగ్గరకు చేరుకున్నారు. గుడిలో నుంచి పసుపు వాసనతో పాటు గాజులు, గజ్జెల మోతాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. వాటిని వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఇప్పల పోలమ్మ అనే దేవత చాలా శక్తి వంతమైనదని భక్తుల విశ్వాసం. అప్పుడప్పుడు గ్రామంలో చాలా మందికి పూనకం వస్తుందని.. అమ్మవారు తనకు కావాల్సింది అడిగి చేయించుకుంటుందని స్థానికులు చెప్తున్నారు. అమ్మవారి కోరిక మేరకు జాతర కూడా జరుపుతుంటారు. ఈ సారి జాతర లేట్ అయింది. అందుకే అమ్మవారు ఇలా సంకేతాలు పంపిందని కొందరు భక్తులు నమ్ముతున్నారు.
గ్రామానికి ఏదో అరిష్టం జరగబోతోందని మరి కొంత మంది భయపడుతున్నారు. గుడిలో వింత శబ్దాల విషయం.. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. ఆలయం దగ్గరకు చేరుకున్నారు. గుడిలో శబ్దాలు ఏంటి.. అసలేం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి