AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గుక్కెడు నీటి కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న అడవి బిడ్డలు.. మన్యం సీమలో తాగునీటి కష్టాలను వెలుగులోకి తెచ్చిన టీడీపీ

గుక్కెడు నీళ్ళ కోసం ఆదివాసీ మహిళా తల్లులు పడుతున్న ఆక్రందనను పట్టించుకునే నాథుడే లేడు. ప్రతిపక్ష టిడిపి తన అధికార సోషల్ మీడియా ద్వారా కూడా వీళ్ళ కష్టాలని బయటపెట్టే ప్రయత్నం చేయడం తో ఈ సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: గుక్కెడు నీటి కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న అడవి బిడ్డలు.. మన్యం సీమలో తాగునీటి కష్టాలను వెలుగులోకి తెచ్చిన టీడీపీ
Agency Drinking Water Probl
Surya Kala
|

Updated on: Aug 09, 2022 | 6:40 AM

Share

Andhra Pradesh: అమాయక ఆదీ వాసులు మనలాంటి ప్రజలే అన్న భావనను ప్రభుత్వాలు మర్చిపోయాయని చెప్పుకోవాలి. నిజమే ఇప్పటికీ 75 సంవత్సరాల వజ్రోత్సవ స్వతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకుంటున్నాం. అయితే నేటికీ అనేక గ్రామాలు కనీస అవసరాలకు దూరంగా ఉన్నాయి.. గుక్కెడు నీరు తాగడానికి కూడా అవస్థలు పడే ప్రజలు ఉన్నారు. అవును నేటికీ కనీసం తాగునీటి నీ అందించలేని దుస్థితిలో ఉన్నామంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని ఎలా వర్ణించాలి. ఇప్పటికీ నీళ్ళ కోసం మహిళలు నాలుగు కిలోమీటర్లు కొండ ఎక్కి మళ్లీ దిగి తెచ్చుకోవడం అంటే.. అదే మన ఆడవాళ్ళు అలా కష్టపడుతూ ఉంటే చూడగలమా? కానీ గుక్కెడు నీళ్ళ కోసం ఆదివాసీ మహిళా తల్లులు పడుతున్న ఆక్రందనను పట్టించుకునే నాథుడే లేడు. ప్రతిపక్ష టిడిపి తన అధికార సోషల్ మీడియా ద్వారా కూడా వీళ్ళ కష్టాలని బయటపెట్టే ప్రయత్నం చేయడం తో ఈ సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది.

పాడేరు డివిజన్లోని మారుమూల శివారు గ్రామాల్లో గుక్కెడు తాగునీటి కోసం ఆదివాసీ మహిళలు పడుతున్న బాధలు చూస్తే బిందెడు కన్నీరు వస్తాయి. ఈ ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేకపోవడంతో తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆలోచిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. కొయ్యూరు, చింతపల్లి మండలాల సరిహద్దులో ఉన్న జాజులబంద గ్రామల్లో కూడా ఇదే గోస కొనసాగుతోంది. ఈ గ్రామంలో కోందు తెగకు చెందిన 170 మంది గిరిజనులు నివాసముంటున్నారు. కొయ్యూరు మండలం, మూలపేట పంచాయతీకి చెందిన శివారు గ్రామమే ఇది. ఇక్కడ ప్రజలకు పూర్వం నుంచి ఊటగెడ్డ నీరే ఆధారం… కొండ పై భాగంలో ఉన్న వీరు సమీపంలోని కొండ గెడ్డకు వెళ్లి నీరు తెచ్చుకోవాలంటే మధ్యలో నిత్యం నీరు ప్రవహించే చాపరాతిని దాటాల్సి ఉంటుంది. దీనిపై నిరంతరం నీరు ప్రవహించడం వల్ల నాచు కట్టి జారిపోతూ ఉంటుంది. స్థానిక గిరిజనులు దీనిపై నుంచి వెళ్లేపుడు చాలాసార్లు పడిపోయిన సందర్భాలున్నాయి. ఇదేకాకుండా వీరు గెడ్డ నీటిని తాగడం వల్ల నిత్యం ఏదో వ్యాధితో ఇబ్బందులు పడుతుంటారు. వర్షాకాలంలో అయితే గెడ్డలో నీరు కలుషితమై మరిన్ని రోగాలు వస్తుంటాయి. ఈ గ్రామంలో తాగునీటికి అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వీరంతా వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. నీటితో బిందెలను తలపై ఉంచి, జారుతున్న రాతిపై మోకాళ్లు వేసి, దణ్ణం పెడుతూ మా గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు. గెడ్డ నీటిని తాగడం వల్ల నిత్యం ఏదో ఒక వ్యాధితో ఇబ్బందులు పడుతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కనీసం ఈసారైనా మా సమస్య పట్టించుకోండి అంటి మహిళలు మోకాళ్లపై కూర్చుని వినూత్న నిరసన తెలిపిన వైనం చూసైనా పాలకుల్లో సిగ్గు రావాలి. వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఆ సంతోషాలు, ఆ ఫలాలు కూడా అడవిబిడ్డలకు కూడా  దక్కేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

Reporter : Eswar, TV9 Telugu