Diabetes: మీ పాదాలలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, డయాబెటిస్ సమస్య తీవ్రమవుతున్నట్లే..

మధుమేహ రోగులు ప్రధానంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ సమయంలో పాదాలకు సంబంధించిన అనేక లక్షణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

Diabetes: మీ పాదాలలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, డయాబెటిస్ సమస్య తీవ్రమవుతున్నట్లే..
Diabetes
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 09, 2022 | 9:38 AM

Diabetes Affects Legs: నేటికాలంలో చాలామంది ముధుమేహం బారినపడుతున్నారు. డయాబెటిస్ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ప్రభావితం చేస్తోంది. అయితే, మధుమేహ రోగులు ప్రధానంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ సమయంలో పాదాలకు సంబంధించిన అనేక లక్షణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చక్కెర స్థాయి పెరగడం మొత్తం శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. పాదాలు మన శరీరంలో ముఖ్యమైన భాగం. మరోవైపు మధుమేహం వల్ల పాదాల్లో నొప్పులు, వాపులు వంటి అనేక సమస్యలు రావచ్చు. మీరు కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులైతే పాదాలపై కనిపించే చెడు లక్షణాలను విస్మరించకూడదు. ఆ లక్షణాలేంటో తెలుసుకోండి.

మధుమేహం పెరగడం వల్ల పాదాలలో ఈ సమస్యలు రావచ్చు..

  • పాదాలలో నొప్పి లేదా వాపు.
  • మధుమేహం పాదాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
  • మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే, రక్తం గడ్డకట్టడం కూడా జరగవచ్చు.
  • మధుమేహం పాదాలలో తిమ్మిరి లేదా జలదరింపుకు కారణమవుతుంది.
  • మధుమేహం వల్ల కూడా పాదాల్లో మంటగా అనిపించవచ్చు.
  • రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.

డయాబెటిస్ సమయంలో పాదాల సమస్యలను ఎలా వదిలించుకోవాలి?

ఇవి కూడా చదవండి

ఉప్పు నీరు: రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల మీ పాదాలలో నొప్పి ఉంటే.. ఉప్పు నీటిని ఉపయోగించవచ్చు. దీని కోసం మీ పాదాలను ఉప్పు నీటిలో ముంచి కాసేపు కూర్చోండి. నీరు గోరువెచ్చగా ఉండాలి. ఇది పాదాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

రోజూ నడవండి: డయాబెటిస్‌లో పాదాలలో రక్త ప్రసరణ మరింత తీవ్రమవుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ప్రతిరోజూ ఒకగంటపాటు నడవండి. నడక ద్వారా మధుమేహంతోపాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.

షుగర్ టెస్ట్ చేయించుకోండి: మధుమేహం సమయంలో పాదాలలో కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించుకోండి. దీని కోసం ఎప్పటికప్పుడు మధుమేహాన్ని తనిఖీ చేసుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి