AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: సృష్టికి ప్రతిసృష్టి దిశగా ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు.. స్పెర్మ్ అవసరం లేకుండా కృతిమ పిండం సృష్టి

ఒక జీవి ప్రాణం పోసుకోవడానికి స్పెర్మ్, గుడ్డు , గర్భం అవసరం. అంతేకాదు.. ప్రాణం పోసుకున్న శిశువు... భూమిమీద పడడానికి 9 నెలల పాటు సమయం అవసరం. అయితే ఇజ్రాయెల్ దేశం ఈ మూడు విషయాలు లేకుండా కృత్రిమ పిండాన్ని సృష్టించింది.

Viral News: సృష్టికి ప్రతిసృష్టి దిశగా ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు.. స్పెర్మ్ అవసరం లేకుండా కృతిమ పిండం సృష్టి
Israeli Scientists
Surya Kala
|

Updated on: Aug 09, 2022 | 10:07 AM

Share

Viral News: మనిషి తన మేధస్సుతో సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. ఉపగ్రహాలను తయారు చేస్తున్నాడు. తెగిపడిన అయవాల స్థానంలో సరికొత్త అవయవాలను ఏర్పాటు చేస్తున్నాడు.. అయితే ఇప్పుడు మరింత ముందుకు అడుగు వేసి.. సరికొత్త ఆవిష్కరణ చేశాడు మానవుడు.. జీవికి ప్రాణం పోసుకోలంటే స్త్రీ, పురుషుల కలయిక తప్పని సరి. అది ప్రకృతి నియమం కూడా.. అయితే తాజాగా ఇజ్రాయెల్ ప్రకృతి నియమానికి సవాల్ చేస్తూ..   తన టెక్నాలజీ కారణంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ పిండాన్ని సృష్టించింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనది. విశేషమేమిటంటే ఈ కృత్రిమ పిండానికి గుండె కూడా కొట్టుకోవడంతోపాటు మెదడు కూడా రెడీ అవ్వడం విశేషం.

ఒక జీవి ప్రాణం పోసుకోవడానికి స్పెర్మ్, గుడ్డు , గర్భం అవసరం. అంతేకాదు.. ప్రాణం పోసుకున్న శిశువు… భూమిమీద పడడానికి 9 నెలల పాటు సమయం అవసరం. అయితే ఇజ్రాయెల్ దేశం ఈ మూడు విషయాలు లేకుండా కృత్రిమ పిండాన్ని సృష్టించింది. ఇప్పటివరకు ఈ ఫలితం కూడా సానుకూలంగా ఉంది. ఇజ్రాయెల్ ఈ పిండాన్ని ఎలా తయారు చేసిందనేది ఇప్పుడు ప్రశ్న. కాబట్టి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోండి.

ఎలా సిద్ధం చేశారంటే? ఇజ్రాయెల్‌కు చెందిన వీజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ స్టెమ్ సెల్స్ ద్వారా ఈ ఘనతను సాధించిందని తెలియజేద్దాం. ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కృతిమ పిండాలను తయారు చేయవచ్చని ఆలోచించారు. ఆ దిశగా చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు పిండం గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. అంతేకాదు మెదడు కూడా సిద్ధంగా ఉంది. ఈ పిండం ఎలుక నుండి తయారు చేయబడిందని.. ముందు తోక మొదలైన  అభివృద్ధి .. మెదడు ఎదుగుదల వరకూ చేరుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది ఫలదీకరణ గుడ్లు లేకుండా తయారు చేసిన ఇది ఒక రకమైన కృత్రిమ పిండం. ఈ పిండం అభివృద్ధితో శరీరం ఎలా ఏర్పడుతుంది అనే విషయాలను తెలుసుకోవడం సహాయపడుతుంది. ఈ పరిశోధనలతో విజయవంతం అయితే.. అప్పుడు జంతువుల వాడకాన్ని కూడా తగ్గించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.  అంతేకాదు అనేక రకాల మానవులకు అవసరమైన వ్యాధి నివారణ కారకాలను తయారు చేయవచ్చు. లుకేమియా రోగి కి కావాల్సిన చర్మ కణాలను చికిత్స చేయడానికి ఎముక మజ్జ కణాలుగా మార్చవచ్చు.

అనేక ప్రయోగాలు చేయాల్సి ఉంది.  నివేదికల ప్రకారం, మూల కణాలతో తయారు చేయబడిన ఈ పిండాన్ని ప్రత్యేక ప్రదేశంలో ఉంచారు . ఇక్కడే పిండాన్ని అభివృద్ధి చేశారు. గర్భం లేకుండా మూలకణాల ద్వారా జీవి సృష్టించబడటం దీనికి ప్రత్యేకత. దీని కోసం, శాస్త్రవేత్తలు గర్భంలో పిండం అభివృద్ధికి ఉపయోగపడే అన్ని పద్ధతులను ఉపయోగించారు. ఇందులో సహజ పద్ధతుల్లో కాకుండా కృత్రిమ పద్ధతుల ద్వారా నిర్మించబడింది. పిండం ఎదుగుదల కోసం వాతావరణాన్ని కృత్రిమ మార్గాల ద్వారా కూడా అందించారు.

ఈ రకమైన ప్రయత్నం గతంలో జరిగింది. అయితే కణాలను ఉత్పత్తి చేయడం చాలా కష్టమయింది. ఎందుకంటే అవి మార్పిడికి నిర్దిష్ట కణజాలంగా సరిపోలేదు. ఈ పరిశోధన తదుపరి పరిశోధనలకు ముఖ్యమైనదని శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. అనేక రకాల పిండాలను తయారు చేయడంలో ఇది సహాయపడుతుందని నమ్ముతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..