Baby Diapers: మీ పిల్లలకు డైపర్లు వేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఇక ఎప్పటికీ..
ఈ రోజుల్లో పసిపిల్లలకు డైపర్లు వాడని తల్లిదండ్రలు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ఐతే రోజు పిల్లలకు డైపర్లు వాడటం వల్ల తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయని ఫ్రాన్స్‌లో నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం..
Study finds toxic chemicals in baby diapers: ఈ రోజుల్లో పసిపిల్లలకు డైపర్లు వాడని తల్లిదండ్రలు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ఐతే రోజు పిల్లలకు డైపర్లు వాడటం వల్ల తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయని ఫ్రాన్స్‌లో నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం.. యూరప్ అంతటా విక్రయించబడే యూజ్ అండ్ త్రో డైపర్లలో 38 రసాయనాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటిల్లోని రసాయనాలు హార్మోన్లలో కలుస్తున్నట్లు వీరు తెలిపారు. ముఖ్యంగా డయాక్సిన్లు, సువాసన కలిగించే రసాయనాలు, ట్రిబ్యూటిల్-టిన్ (TBT), సోడియం పాలియాక్రిలేట్స్ డైపర్‌లలో ఉపయోగించే హానికరమైన రసాయనాలు.
ఈ రసాయనాలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. చర్మం ఎర్రగా మారేలా చేసి, ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తాయి. డైపర్ వేసినప్పుడు పిల్లలకు అసౌకర్యంగా అనిపించినా లేదా ఎక్కువగా ఏడుస్తున్నా.. వెంటనే డైపర్ ఉన్న చర్మ పరిసరాలను పరిశీలించాలి. చర్మం ఎర్రగా మారినట్లయితే వెంటనే డైపర్‌ను తొలగించాలి. తడిసిన ప్రతిసారీ డైపర్‌ను మార్చాలి. ఎక్కువసేపు అలాగే ఉంచితే పిల్లలకు మూత్రనాళ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శరీర నిర్మాణ సంబంధమైన లక్షణాల వల్ల ఆడ శిశువులలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. డైపర్ల వల్ల అలర్జీలు, దద్దుర్లు, పొక్కులు వస్తాయి. వీటిలోని కర్బన సమ్మేళనాలు పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థను దెబ్బ తీస్తాయి. తడిసిన డైపర్లను తొలగించకుండా అలాగే ఉంచితే ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. కాబట్టి మీ చిన్నారులకు డైపర్ ఉపయోగించే ముందు ఓ సారి ఆలోచించండి..