AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pineapple: బరువు తగ్గడానికి పైనాపిల్‌ తింటున్నారా? ఐతే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే..

అపోహ.. పైనాపిల్. రోజూ 2 కప్పుల పైనాపిల్ ముక్కలు తింటే 5 రోజుల్లో 5 కిలోలు తగ్గొచ్చనేది అనేక మంది నమ్మే అవాస్తవం. ప్రముఖ పోషకాహార నిపుణుడు లవ్‌నీత్ బాత్రా ఏంచెబుతున్నారంటే..

Pineapple: బరువు తగ్గడానికి పైనాపిల్‌ తింటున్నారా? ఐతే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే..
Weightloss
Srilakshmi C
|

Updated on: Aug 10, 2022 | 11:46 AM

Share

Side effects of Pineapple in Telugu: నేటి జీవన శైలి కారణంగా అధిక బరువు అనేది చాలా సాధారణ సమస్యగా పరిణమిస్తోంది. నిజానికి..ఉబకాయం సమస్య వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి సమస్యలు అధిక బరువు వల్లనే సంభవిస్తాయి. ఇక నానాటికీ బరువు పెరిగిపోతూ ఉంటే శరీరం కూడా త్వరగా అలసిపోతుంది. ఎలాంటి శరీరక వ్యాయామం చేయకపోవడం, ఒకే చోట కూర్చొని తినడం, తాగడం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఉబకాయం త్వరగా దరిచేరుతుంది. ఐతే బరువు తగ్గడం అంత సులువేం కాదు. అందుకు కొన్ని నియమాలు, ప్రత్యేక డైట్ చార్ట్‌ను ఫాలో అవ్వవల్సి ఉంటుంది. వయస్సు, లింగం, శరీరతత్వం వంటి అంశాల ప్రతిపదికన ఆహార నియమాలు పాటించవల్సి ఉంటుంది. ఐతే ఈ విషయంలో ఇంటర్నెంట్‌లో దొరికే సమాచారం గుడ్డిగా ఫాలో అయ్యి కొత్త తంటాలు తెచ్చుకుంటారు కొంతమంది. రోజంతా తినకుండా ఉంటే అదనపు కొవ్వు అధిక మొత్తంలో కరిగిపోతుందని చాలా మంది అనుకుంటారు. అలాగే ఆహారంలో కార్బోహైడ్రేట్లను తొలగించగలిగితే బరువు తగ్గొచ్చని మరి కొందరు అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. మరొక అపోహ.. పైనాపిల్. రోజూ 2 కప్పుల పైనాపిల్ ముక్కలు తింటే 5 రోజుల్లో 5 కిలోలు తగ్గొచ్చనేది అనేక మంది నమ్మే అవాస్తవం. ప్రముఖ పోషకాహార నిపుణుడు లవ్‌నీత్ బాత్రా ఏంచెబుతున్నారంటే..

పైనాపిల్ ఆరోగ్యానికి హాని తలపెడుతుంది. ప్రతి రోజూ దీనిని తినడం వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొకతప్పదని హెచ్చరిస్తున్నారు. రోజువారీ ఆహారంతో పాటు 5 రోజుల పాటు పైనాపిల్ తింటే ఖచ్చితంగా 2 కిలోల బరువు తగ్గొచ్చని 1970లో డానిష్ మనస్తత్వవేత్త స్టాన్ హెగ్లర్ పేర్కొన్నాడు. ఐతే దీనితో పాటు శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ కూడా బయటకు వస్తాయి. పైనాపిల్‌ను ఎక్కువగా తినడం వల్ల కలిగే సమస్యలు ఇవి..

ఇవి కూడా చదవండి
  • పైనాపిల్‌లో విటమిన్ ‘సీ’ అధికంగా ఉంటుంది. ఇది కడుపులో జీర్ణ ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ యాసిడ్ కారణంగా.. మానసంతా చికాకుగా ఉంటుంది. ఆకలిగా అనిపించడం, అలసట, వికారం, కడుపు నొప్పి, విరేచనాలు వంటివి తలెత్తుతాయి.
  • పైనాపిల్ అధికంగా తీసుకోవడం వల్ల కళ్లు తిరగడం, తలనొప్పి, నిద్రలేమి వంటివి కూడా తలెత్తుతాయి. పైనాపిల్‌లో ప్రొటీన్లు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. దీనివల్ల శరీరంలో పోషకాహార లోపం తలెత్తే ప్రమాదం ఉంది.
  • పైనాపిల్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే స్కిన్‌ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ పండులోని బ్రోమెలైన్ చర్మ సమస్యలు, దద్దుర్లు, వాంతులకు కారణం అవుతుందని ఆయన అన్నారు.